జయలలిత శకం... ఏ సంవత్సరంలో ఏం జరిగింది?
Publish Date:Dec 5, 2016
Advertisement
1961: నటిగా సినిమా కెరీర్ ప్రారంభించారు. మొదటి సినిమా ఇంగ్లీష్ భాషలో నిర్మించిన ఎపిస్టల్! 1965: హీరోయిన్ గా మొదటి సినిమా సైన్ చేశారు... 1980: తన చివరి తమిళ సినిమా, నదియై తేడీ వందా కాదల్ లో నటించారు... 1982: ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడీఎంకే పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. కడలూర్ లో మొట్ట మొదటి బహిరంగ సభలో మాట్లాడారు! 1983:ఏఐఏడీఎంకే పార్టీ ప్రాపగాండా సెక్రెటరీగా నియమింపబడ్డారు. తిరుచందూర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు... 1984: ఎంజీఆర్ తో వైరం ముదిరి దూరం పెరిగింది. అనేక పార్టీ పదవుల్నుంచీ తొలగించబడ్డారు... 1987: ఎంజీ రామచంద్రన్ మరణంతో పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గం ఎంజీఆర్ భార్య జానకి రాంచంద్రన్ కు మద్దతు పలికితే ఇంకో వర్గం జయలలితకు అండగా నిలబడ్డారు... 1988: జానకీ రాంచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కాని, 21రోజుల్లోనే రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది... 1989: డీఎంకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. జానకీ రామచంద్రన్ ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తప్పుకున్నారు. జయలలిత పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. అదే సంవత్సరం డీఎంకే, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అంసెబ్లీ హాల్లో ఘర్షణ పడ్డారు. జయకు తీవ్రమైన అవమానం జరిగింది. ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో కాలుమోపుతానని శపథం చేసి చినిగిన చీరతో వెళ్లిపోయారు... 1991: ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ కూటమి డీఎంకేను మట్టి కరిపించింది. జయలలిత తొలిసారి సీఎం అయ్యారు... 1996: అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైంది. జయలలిత అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. 48కేసులు ఆమె మీద, ఆమె స్నేహితురాలు శశికళ మీదా మోపబడ్డాయి... 2001: రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఎన్నికయ్యారు. కాని, సుప్రీమ్ తీర్పుతో పదవి కోల్పోయారు. పన్నీర్ సెల్వమ్ అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు... 2003: ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతి లభించటంతో ఆండిపట్టి నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు పురుచ్చి తలైవీ. మరో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2006: డీఎంకే కూటమి చేతిలో ఓడిపోయిన జయలలిత 2011వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నారు... 2011: మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన జయ ప్రాణ స్నేహితురాలు శశికళకు దూరం అవుతూ వచ్చారు... 2014: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వంద కోట్ల ఫైన్, నాలుగేళ్ల జైలు శిక్షకి గురైన జయలలిత కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చింది... 2016: వరుసగా రెండోసారి, మొత్తంగా నాలుగోసారి జయలలిత ముఖ్యమంత్రిగా తమిళ ఓటర్ల చేత ఎన్నోకోబడ్డారు!
1948: 24 ఫిబ్రవరిన కర్ణాటక రాష్ట్రపు ఆనాటి మైసూర్ సంస్థానంలో మేల్ కొటే క్షేత్రంలో జన్మించారు.
http://www.teluguone.com/news/content/jayalalithaa-45-69940.html





