త్వరలో రాజ్యసభకు జస్టిస్ చలమేశ్వర్? ఢిల్లీలో పట్టు కోసం జగన్ ప్లాన్! 

Publish Date:Dec 17, 2020

Advertisement

చంద్రబాబు టార్గెట్ గా దూకుడు పెంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపనున్నారని సమాచారం. ఏపీకి సంబంధించి వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకదానికి వైసీపీ అభ్యర్థిగా జస్టిస్ చలమేశ్వర్ ను ఇప్పటికే జగన్ ఖరారు చేశారని తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లేందుకు జస్టిస్ చలమేశ్వర్ కుడా అంగీకరించారని చెబుతున్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కు కీలక బాధ్యతలు ఇవ్వాలనుకోవం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంటుందని, ఢిల్లీ స్థాయిలో తనకు ఇబ్బంది లేకుండా చూసేందుకే జగన్ ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  

 

ఇటీవలే జస్టిస్ చలమేశ్వర్ కుమారుడికి వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. జాస్తి నాగభూషణ్‌ను అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుబ్రమణ్యం శ్రీరామ్ అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సేవలు అందిస్తున్నారు. అయినా జాస్తి నాగభూషన్ ను కూడా రెండో అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది జగన్ సర్కార్. ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరును ఆక్షేపిస్తూ సీఎం జగన్ సీజేఐకి ఎనిమిది పేజీల లేఖ రాయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రిని కలిసి జగన్ పలు నివేదికలు కూడా సమర్పించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు ఢిల్లీకి వెళ్లినవారిలో జాస్తి నాగభూషణ్‌ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుమారుడు కావడంతో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అందరూ అనుకున్నారు. ఇప్పుడు నాగభూషణ్‌ను అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా నియమించడంతో జగన్ బలమైన వ్యూహంలో ఉన్నారని భావిస్తున్నారు. 

 

ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరుపై సీజేఐకి రాసిన లేఖలో జస్టిస్ చలమేశ్వర్, మాజీ ఏజీ దమ్మాలపాటి పేర్లు కూడా ప్రస్తావించారు జగన్. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జడ్జిలుగా ఉన్నవారి నియామకాలు, గతంలో దమ్మలపాటికి అనుకూలంగా వెలువడిన ఉత్తర్వులను ప్రముఖంగా పేర్కొన్నారు. గతంలో జస్టిస్ రమణ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు.. న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌ కు అనుకూలంగా పలు ఉత్తర్వులు ఇచ్చారని, గతంలో ఓ ఐదుగురు జడ్జిల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్‌ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం.. అప్పటి సీఎం చంద్రబాబు అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని.. ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ స్వయంగా చెప్పారని కూడా సీఎం జగన్ లేఖలో పేర్కొనడం సంచలనం రేపింది. దీంతో సుప్రీంకోర్టు సీజేఐకి జగన్ రాసిన లేఖ వెనక జస్టిస్ చలమేశ్వర్ ప్రమేయం ఉందనే చర్చ జరిగింది. జగన్ తో పాటు ఢిల్లీకి వెళ్లిన వారిలో జస్టిస్ నాగభూషణం కూడా ఉండటంతో ఈ వాదనకు అప్పుడు బలం చేకూరింది. 

 

ఏపీ సీఎం జగన్ తో జస్టిస్ చలమేశ్వర్ కుటుంబానికి చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి.  చంద్రబాబుతో విభేదాలున్న జస్టిస్ చలమేశ్వర్.. ఆయనకు వ్యతిరేకంగా జగన్ కు దగ్గరయ్యారని చెబుతారు. జస్టిస్ చలమేశ్వర్ తో పాటు ఆయన కుమారుడు జగన్ కు కీలక సమయాల్లో అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుసార్లు ఆయనను కలిశారు జస్టిస్ చలమేశ్వర్. 2019 జూన్‌ 11న విజయవాడలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు చలమేశ్వర్‌  పాల్గొన్నారు. ఈ ఏడాది  జనవరి 30న సుప్రీంకోర్టు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. ఈ సందర్భంగా చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సత్కరించారు సీఎం జగన్. 

 

జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు నందమూరి కుటుంబంతో చాలా దగ్గరి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లీగల్ వ్యవహారాలన్ని జస్టిస్ చలమేశ్వరే చూసేవారట. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సమయంలో జాస్తి చలమేశ్వర్ స్వయంగా హరికృష్ణ పాడె మోశారు.  అంత దగ్గరి అనుబంధం వారికి ఉంది. అయితే చంద్రబాబుతో మాత్రం మొదటి నుంచి జస్టిస్ చలమేశ్వర్ కు సఖ్యత లేదని చెబుతారు. జస్టిస్ రమణకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో జస్టిస్ చలమేశ్వర్ ఆయనకు దూరమయ్యారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయ వ్యవస్థలో బలంగా ఉన్న చంద్రబాబును దెబ్బ కొట్టడానికి జస్టిస్ చలమేశ్వర్ ను అస్త్రంగా జగన్ వాడుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడికి జగన్ కీలక బాధ్యతలు ఇవ్వడమే చర్చనీయాంశం కాగా.. త్వరలో జస్టిస్ చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపిస్తున్నారనే విషయం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.