జన్ ధన్ ఖాతాలు ఇక కనుమరుగేనా?!

Publish Date:May 14, 2023

Advertisement

దాదాపు తొమ్మిదేళ్ళ కిందట ఆర్భాటంగా.. ఒక అద్భుత  ప్రాయోజిత పథకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పి.ఎంజేడీవై) పథకం క్రమంగా నిర్వీర్యమవుతోంది. 2014 ఆగస్టులో తన మాసన పుత్రికగా మోడీ ఆవిష్కరించిన ఈ ప్రతిష్టాత్మక పథకం ఇప్పుడు జనాదరణ కోల్పోతోంది. ఏడాది కాలంగా ఆర్ధిక లావాదేవీలు స్తంభించడంతో జనధన్ ఖాతాలన్నిటినీ మూసివేయడానికి  బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 2,23,218 పీఎంజేడీవై ఖాతాలున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో 1,18,55,126 ఖాతాదారులున్నారు. వీటిలో 80 శాతానికి పైగా ఖాతాల్లో ఆర్ధిక లావాదేవీలు నిలిచి పోయి చాలా కాలమైంది. బ్యాంకులు పలు సార్లు మెసేజ్ రూపంలో అల్టిమేటం ఇచ్చినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో మెజారిటీ ఖాతాలను బ్లాక్ లిస్టులో పెట్టేశారు. 2023 మార్చి నెల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనా కింద బ్యాంకులలో ఉన్న  ఖాతాల సంఖ్య 48.85 కోట్లు. ప్రస్తుతం ఈ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.1,98,844.34 కోట్లు జమ అయ్యాయి.

దాదాపు 4.08 కోట్ల ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. నో క్యాష్.. నో ట్రాన్సాక్షన్స్ సాకుతో వివిధ జాతీయ, షెడ్యూల్ ఇప్పటికే శాలను బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. ఆర్ధిక లావాదేవీలే ఆధారంగా ఖాతాల కొనసాగింపునకు బ్యాంకులు అల్టిమేటంతో సంప్రదించిన వారందరికీ సేవింగ్ ఖాతాలుగా మార్చుకోవాలని అధికారులు సెలవిస్తున్నారు. ఇది ప్రభుత్వాదేశాలు ఏమాత్రం కావని, స్తంభించిన ఖాతాలను సేవింగ్ కోసం మార్చుకోవాలని మౌలిక సూచనలు మాత్రమేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణ ఖాతాలు కావడంతో డబ్బులు జమ చేసేందుకు ఆసక్తి. చూపని ఖాతాదారులు ఆశించిన ప్రయోజనాలేమీ కనిపించకపోవడంతో ఇక మాకొద్దులే.. అని వదిలేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకానికి రెండు కోణాల్లో ముప్పు వాటిల్లుతోంది. కేంద్రం ఆదరణ తగ్గిపోవడం ఒకటైతే.. ఖాతాదారుల్లో అవగాహన లోపం మరొకటిగా పీఎంజేడీవై పథకం నిర్వీర్యానికి గురవుతోంది.

ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 647 బీమా క్లెయిమ్ లు కేంద్రానికి అందాయి. వాటిలో 928 క్లెయిమ్లను మాత్రమే పరిష్కరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 941 క్లెయిమ్ లు వచ్చాయి. వాటిలో 182 క్లెయిమ్స్ సెటిల్ చేయగా, 48 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 111 బ్లెయిమ్లు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో ప్రభుత్వానికి కూడా తెలియదు. సెటిల్ చేసిన క్లెయిమ్ ల కోసం రూ.2.27 కోట్లు చెల్లించారు. అదేవిధంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 306 17 యిమ్ లను పరిష్కరించారు. 10. క్లెయిమ్లు తిరస్కరించారు. మిగిలిన 149 దరఖాస్తులు ప్రస్తుత పరిస్థితి ఏంటో గవర్నమెంట్ వారికి సైతం తెలియదు. గత ఆర్థిక సంవత్సరంలో సెటిల్ అయిన కేసుల రూ.1.88 కోట్లు చెల్లించారు.

పథకం కింద ఖాతాదార్లకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. గతంలో ఈ కవరేజీ రూ.1 లక్షగా ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదార్లు బ్యాంక్ ఖాతాతో పాటు రూపే కెవిట్ కార్డును పొందుతారు. ప్రమాద బీమా పరంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల లోపు, ద ఖాతాదారు తన రూపే కార్డును ఉపయోగించి ఏదైనా లావాదేవీ జరిపినట్లయితే, అతను ||మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హుడు అన్న షరతు ఉంది. చాలా సందర్భాలలో క్లెయిమ్ తిరస్కరణకు ఈ షరతే కారణం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి.. ప్రజలకు ఏదో చేసెద్దామని రూపకలగపన చేసిన పథకం.. నేడు సొంత ఆదరణ కరవై.. నిర్వీర్యం అవుతున్న తరుణంలో.. ఖాతాలను సేవింగ్ అకౌంట్ గా మార్చుకోమని బ్యాంకులు..గగ్గోలు పెడుతున్న తరుణంలో... ప్రధాని గాని, ప్రధాన మంత్రి కార్యాలయం గాని దీనిపై తగిన వివరణ ఇవ్వకపోవడం.. గమనార్హం.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.