తెలంగాణలో పోటీకి జనసేన సై

Publish Date:Jan 25, 2023

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చేశారు. ఏపీలోనే కాదు, తెలంగాణ శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లోనూ జనసేన పోటీ  చేస్తుందని స్పష్టం చేశారు. నిజానికి గత కొంత కాలంగా జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయినా, అంత క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చేశారు. పూర్తి క్లారిటీ ఇచ్చారు.

జగిత్యాలలో నిర్వహించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశంలో ఆయన, ఎలాంటి అనుమానం లేకుండా వచ్చే ఎన్నికల్లో 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పొత్తుల విషయంలోనూ ఆయన స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం, రాకున్నా ఓకే, ఒంటరిగానే పోటీ చేస్తాం.. జనసేన తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలి.. కనీసం 10 మంది జన సైనికులు అసెంబ్లీలో ఉండాలనేది, తన ఆకాంక్ష అని అన్నారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఒక ఆశయం కోసం తాను పోరాడుతున్నట్లు పవన్‌ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని, ఇక్కడి ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందానన్నారు. ఆలాగే  జనసేన తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ అని అంటూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో  బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాలను విని తాను గళం విప్పానని గతాన్ని గుర్తు చేస్కున్నారు. అలాగే పరోక్షంగానే అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ కు సున్నితంగా చురకలంటించారు.

తెలంగాణ  రాష్ట్ర  సాధన వరకు పోరాటాలు చేసింది, తెలంగాణ సాధించింది తెలంగాణ  ప్రజ లే అంటూ, భారాస నేతలు ప్రవచించే,  కేసేఆర్  ఒక్కడే  చావు నోట్లో తలపెట్టి  తెలంగాణ సాధించారనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. అయితే అదే సమయంలో  కొత్తగా వచ్చిన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏదో సాధించాలని ముందుకు వెళ్తోంది ..  అందుకు నేను ఎదురు చూస్తున్నాను, అంటూ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన రీతిలో కేసేఆర్ ప్రభుత్వాన్నిపవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేదు. అఫ్కోర్స్ అన్నప్రాసన రోజే ఆవకాయ  ఆశించలేము అనుకోండి.. ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చూడవలసి వుందని పరిశీలకులు అంటున్నారు.  

అయితే తెలంగాణలో జనసేనతో ఎవరు పొత్తు పెట్టుకుంటారు. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో తెలుగు దేశం, జనసేన పొత్తుకు ఇరు పక్షాల నుంచి సుముఖత వ్యక్త మవుతోంది. ఒక ప్రకటన మినహా మిగిలిన క్రతువంతా ఆల్మోస్ట్ కంప్లీటై పోయిందని పొలిటికల్ సర్కిల్స్  లో వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎవరి మెడలో మూడు ముళ్ళు వేస్తారు, అనేది ఆసక్తికరంగా మారింది. అయితే  తెరాస భారాసగా పేరు మార్చుకుని ఏపీలో ఎంట్రీ ఇచ్చిన నేపధ్యం ఒక  వైపు  కొద్ది రోజుల వ్యవధిలో టీడీపీ, జనసేన తెలంగాణ రాజకీయ వేదిక మీదకు వచ్చిన నేపధ్యం మరోవైపు .. చూస్తుంటే, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజకీయం ముందు ముందు మరింత ఆసక్తి దాయకంగా మారుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.