మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టు!

Publish Date:Apr 7, 2026

Advertisement

కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్  నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టుపడుతోంది. జగన్ హయాంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు తెలిసిందే.  అప్పట్లో పవన్ వర్సెస్ ద్వారంపూడి అన్నట్టుగా సాగిన మాటల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న జనసేన నాయకులు,  కూటమి అధికారంలోకి రావడంతో ఆయనపై చర్యలకు ఒత్తిడి పెంచుతున్నారు.

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే   అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ అసోసియేషన్ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్న పరిస్థితి. అక్కడ ఆయన ఆధిపత్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జనసేన నాయకులు పావులు కదుపుతున్నారు.  

మరోవైపు  కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా, ఎగుమతులపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. గతంలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తుండటంతో ద్వారంపూడి వ్యాపార సామ్రాజ్యం కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది.  కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆయనకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందంటున్నారు.

ఇలా ఉండగా జనసైనికులు అయితే ద్వారంపూడిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.  జగన్ హయాంలో పవన్‌ను టార్గెట్ చేసి ఆయనపై వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు పాల్పడిన ద్వారంపూడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టడానికి వీల్లేదని పట్టుబడుతున్నారు. జనసేన ఒత్తిడి ఫలితంగానే  త్వరలో  రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉదనీ, ఆ ఎన్నికల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పెత్తనానికి చెక్ పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

 ఒక సారి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పట్టు సడలితే.. ఇక వరుసగా అన్ని వైపుల నుంచీ గతంలో ఆయన చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై ముప్పేట దాడికి జనసైనికులు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలు కాకినాడ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.