Publish Date:Jun 20, 2022
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యధిక రాజకీయ అనుభవం ఉన్న పార్టీ. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఈ రాజకీయ పార్టీని అభివర్ణిస్తుంటారు. సుదీర్ఘ కాలం పాటు దేశంలో తిరుగులేని అధికారం చెలాయించిన ఈ పార్టీ ఇటీవలి కాలంలో బాగా బలహీనపడింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండంటే రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ కు కర్ణుడికి సహజ కవచ కుండలాల్లా.. పార్టీలో వర్గపోరు, అంతర్గత విభేదాలు ఎల్లవేళలా అంటిపెట్టుకునే ఉంటాయి. పార్టీకి విజయావకాశాలున్న చోట కూడా పార్టీలోని విభేదాలు ఆ అవకాశాలకు గండికొట్టే పరిస్థితులు ఎదురౌతున్నా నేతలకు పెద్ద పట్టింపు ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంగా ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దీటైన పోటీ ఇవ్వగలిగే పరిస్థితి ఉందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు క్యాడర్ లో కలవరం సృష్టిస్తున్నాయి. అయోమయానికి కారణమౌతున్నాయి. ఈ పరిస్థితి పలు నియోజకవర్గాలలో నెలకొని ఉంది. అయితే జనగామ జిల్లాలో మాత్రం ఈ వర్గ పోరు ఒకింత తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిలు ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తుండటం.. వేర్వేరు కుంపట్లు రాజేసుకుని పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే వేర్వురుగా నిర్వహిస్తుండటంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఇటీవల వరంగల్ లో జరిగిన రాహుల్ సభ అద్బుత విజయం సాధించడం, ఆ సభలో వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను ప్రతి నియోజకవర్గంలోని గడపగడపచూ చేర్చడంలో కాంగ్రెస్ నాయకులు ఒక నిర్దుష్ట పథకంతో ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతున్నారు.
ఇటీవలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో మున్నెన్నడూ కనిపించని ఐక్యతా కనిపిస్తోందని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణపేరుతో వేధిస్తున్నదంటూ.. దేశ వ్యాప్ంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపు నిచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన పరిశీలకులు సైతం వ్యక్తం చేశారు.
అయితే జనగామ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఏమీ మారలేదు. ఇక్కడ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్యా సయోధ్య అన్నది ఎండమావిలాగే తయారైంది. ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో టికెట్ రేసులో ఉన్నవారే. దీంతో ఇద్దరూ కూడా వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ హామీలను జనంలోకి తీసుకెళ్లే కార్యక్ర మంలో కూడా ఎవరి దారి వారిదేగా ఉంది. ఎవరికి వారు నియోజకవర్గ గ్రామాలలో పర్యటనలు నిర్వహిస్తున్నారు.
ఎవరి క్యాడర్ వారిదే అన్నట్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయిన పరిస్థతి. కోమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడవటూరు సిద్దేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి రచ్చబండ ప్రారంభిస్తే, పొన్నాల లక్ష్మయ్య కొమురవెల్లి మల్లిఖార్జున దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి రచ్చబండ చేపట్టారు. రచ్చబండ కార్యక్రమాన్ని సైతం జనగామ నియోజకవర్గంలోని చేర్యాల,కొమురవెల్లి,మద్దూరు మండలాల్లో ఇరువురు నాయకులు వేరువేరుగా నిర్వహించడంతో పార్టీలో అయోమయం నెలకొంది. ప్రజలు సైతం ఇరువురునేతలూ కాంగ్రెస్ లోనే ఉన్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ గందరగోళపడుతున్నారు. ఈ పరిస్థితిని పార్టీ నాయకత్వంఎలా సరిదిద్దుతుందా అని పార్టీ క్యాడర్ ఎదురు చూస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janagaoncongress-split-into-two-between-two-seniour-leaders-25-138016.html
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.