Publish Date:Jun 20, 2022
చాలాకాలం నిరుపయోగంగా వున్న వస్తువుల్ని పారేస్తాం. దేశంలో పాతనోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు వచ్చాయి. పాత నోట్లు ఇప్పుడు చెల్లవు. చిత్తు కాగితాలతో సమానం. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పుడు అది చెల్లని నోటు. చాలాకాలం అధికారంలో వుండి అన్ని ప్రాంతాలూ సమాంతరంగా అభివృద్ధిపరిచేందుకు కృషి చేయాల్సిన బాధ్యతను కాంగ్రెస్ విస్మరించడం వల్లే ఈ పరిస్థితికి ఆ పార్టీ చేరుకుంది. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే వుందని, చాలా కాలం అధికారంలో వున్న, పురాతన పార్టీ కేవలం ప్రచారానికి, ఆర్భాటాలకే పాలనా కాలం వెచ్చించింది. ఈశాన్య రాష్ట్రాలకు అందుకే కాంగ్రెస్ పై మండిపాటు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా వెనకంజలో వుండ డం గురించి అనేక సందర్భాల్లో అనేకమంది రాజకీయనాయకులు విమర్శిస్తూనే వున్నారు. ఈ ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి కాంగ్రెస్ ఎన్నడూ పెట్టలేదని, కేవలం ఓట్లు అధికారం కోసం ఆకట్టుకునే ప్రచారాలు, ప్రసంగాలు తప్ప వాస్తవంగా చేసిందేమి లేదని అక్కడి ప్రజలు చెబుతూనే వున్నారు. ఇపుడు తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ పాత కరెన్సీనోట్ల వంటిదని ఎద్దేవా చేయడం గమనార్హం.
అధికారంలో వున్ననాళ్లు కనీసం రాజధాని ఎక్స్‌ప్రెస్ కోరికను కూడా అంగీకరించ లేదని ఘాటుగా విమర్శించడం ఆ ప్రాంత ప్రజల మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది. అసలు ఆ పార్టీని ప్రజలు ముట్టడానికి ఇష్టపడని పాత నోట్లుగా మారిపోయిందని, ఆ పార్టీ నిరుపయోగంగా మారిందని బిశ్వశర్మ ఆదివారం అగర్తలా ఉప ఎన్నిక ల ప్రచార సభలో మాట్లాడారు. ఏమాత్రం అభివృ ద్ధిని చేపట్టని కాంగ్రెస్ పాలనన ఒక్క ఈశాన్య రాష్ట్ర పరిస్థితిని చూస్తే తెలుస్తుందని దుయ్యబట్టారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి సుదీప్ రాయ్ బర్మన్ పై బిజెపి అభ్యర్ధిగా పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ సిన్హా ను ఆ పార్టీ నిలబెట్టింది.
ఈ ప్రాంతంలో అసలు కాంగ్రెస్ 2014 నుంచీ ప్రతీ ఎన్నికల్లోనూ ఓటమినే చవి చూసింది. అందుక్కారణం పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పూర్తిగా తగ్గడమేనని ఈశాన్య ప్రజాస్వామిక కూట మి (ఎన్ ఇ డి ఏ) నాయకలు ఘాటుగా విమర్శించారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి విజయాలతో పోలిస్తే సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కి ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పరా జయమే దక్కిందనేది సీ.ఎం. బిశ్వ శర్మ తన ప్రసంగంలో మరో సారి గుర్తు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-situation-like-old-currency-after-demonitisation-25-138018.html
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.