జానా రెడ్డికి గవర్నర్ గిరి.. కొడుకుకు సాగర్ సీటు! బీజేపీలో చేరిక ఖాయమేనా? 

Publish Date:Dec 18, 2020

Advertisement

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించి  కారు పార్టీలో కలవరం రేపిన కమల దళం.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ఫలితాలు సాధించి గులాబీలో మరింత గుబులు రేపింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ జోష్ తో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ గెలుపునకు  కార్యాచరణ సిద్దం చేస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ బలంగా ఉన్న నాగార్జున సాగర్ ను కైవసం చేసుకుంటే తెలంగాణలో తమకు  తిరుగేలేదని భావిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అందుకే సాగర్ కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారట. పార్టీ మారేది లేదు లేదంటూనే బీజేపీ పెద్దల టచ్ లోకి జానా రెడ్డి వెళ్లారని, వారి ముందు పెద్ద ప్రతిపాదనే ఉంచారనే ప్రచారం జరుగుతోంది. 

 

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ..  జానా రెడ్డితో  పార్టీ హైకమాండ్ తరపున సంప్రదింపులు చేస్తున్నారని టాక్.  ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా జానారెడ్డితో మాట్లాడి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. మొదట పార్టీ మారేందుకు ఆసక్తి చూపని జానారెడ్డి.. తర్వాత సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తోంది. తనకు వయసు మీద పడటంతో ఎన్నికల్లో పోటీ  చేయలేనని,  తన కొడుక్కి నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వాలని, తనకు గవర్నర్ పోస్టు ఇవ్వాలని బీజేపీ పెద్దల ముందు జానారెడ్డి ఆఫర్ పెట్టారని సమాచారం. జానా రెడ్డి ప్రతిపాదనను బీజేపీ దాదాపుగా అంగీకరించిందని , అతని కొడుకుని నాగార్జున సాగర్ లో నిలబెట్టి గెలిపించుకుంటామని  కమలం పెద్దలు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో జానా రెడ్డి త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. 

 

దుబ్బాక, జీహెచ్ఎంసీతో పోలిస్తే బీజేపీకి నాగార్జున సాగర్ పూర్తిగా భిన్నం. ఇక్కడ కమలం  బలం అంతంతమాత్రమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీ ఇంత వరకు అసెంబ్లీ సీటు గెలవలేదు. నాగార్జున సాగర్ గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీ చేయగా ఏడు సార్లు గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడినా ఆయన పట్టు మాత్రం నియోజకవర్గంలో పోలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కే లీడ్ వచ్చింది. నాగార్జున సాగర్ లో బీజేపీ బలం అంతంత మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డికి  ఒక్క శాతం ఓట్లే పోలయ్యాయి. నివేదిత కేవలం 2 వేల 675 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ కమలం పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

 

నాగార్జున సాగర్ లో బలహీనంగా ఉన్న బీజేపీ  ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకే  జానారెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని భావిస్తున్నారు.  జానారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం వెనక బీజేపీకి భారీ వ్యూహమే ఉందంటున్నారు. నాగార్జున సాగర్ లో  గెలవడంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయాలని ప్లాన్ చేస్తుందట. జానా రెడ్డి పార్టీ మారితే.. ఆ పార్టీ నుంచి మరి కొంత మంది ముఖ్య నేతలు కూడా కమలం గూటికి వస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ బలహీనం అయితే ప్రజా వ్యతిరేకత ఓటంతా కమలానికే వస్తుందని బీజేపీ నేతల అంచనా.
 

తర్వాత కేసీఆర్ కు చుక్కలు చూపించే యోచనలో ఉందట కమలం పార్టీ. అందుకే నాగార్జున సాగర్ ను తెలంగాణలో అధికారంలోకి రావడానికి అత్యంత కీలకంగా తీసుకుంటున్నారు బీజేపీ నేతలు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. తమకు  ఏ మాత్రం పట్టులేని నాగార్జున సాగర్ లోనూ గెలిస్తే.. ఆ పార్టీకి తెలంగాణలో ఇక తిరుగు ఉండదని రాజకీయ అనలిస్టులు కూడా చెబుతున్నారు. ఆ దిశగానే కమలనాథులు పక్కా కార్యాచరణతోనే కదులుతున్నట్లు కనిపిస్తోంది.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.