లోకేష్ పాదయాత్రకు రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణ

Publish Date:Feb 6, 2023

Advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర  సోమవారం 11వ రోజుకు చేరుకుంది. రోజు రోజుకూ పెరుగుతున్న జనాదరణతో  లోకేష్ పాదయాత్ర ఓ ప్రభంజనంలా సాగుతోంది.  నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 100 కిలోమీటర్లును పూర్తి చేసుకొంది.

జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని  కుప్పం నుంచి ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతోన్నారు. అలాగే  జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను లోకేష్ ఈ పాదయాత్రలో ఎండగడుతున్నారు. విపక్ష  న నేతగా ఉండగా జగన్ చేసిన పాదయాత్రలో నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు..  గద్దెనెక్కిన ఈ మూడున్నరేళ్లలో వాటిని విస్మరించిన తీరును ప్రజలకు కళ్లకు గట్టేలా వివరిస్తున్నారు. 

అదే విధంగా జగన్ తీరు కారణంగా   ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలనే కాదు.. ఎస్సీ, ఎస్టీలపై అక్రమంగా నమోదవుతున్న   కేసులతోపాటు వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై   జగన్ సర్కార్ దెబ్బకొట్టిన  విధానాన్ని లోకేష్ తన పాదయాత్రలో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. అలాగే దళితలను హత్య చేసి.. మృతదేహాలను సైతం డోర్ డెలివరి చేసే సౌకర్యం కూడా జగన్ సర్కార్ కల్పించిందంటూ సెటైర్లు గుప్పించారు.   జగన్  పాలన అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సైతం లోకేష్ జనాలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక లోకేష్ ను కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకునేందుకు జనం పోటీలు పడుతున్నారు. యువత ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. దారిపొడవునా మహిళలు హారతులు పడుతున్నారు. 

ఇలా అన్ని వర్గాల ప్రజలూ లోకేష్ పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. అదే విధంగా దారిపొడవునా కలిసిన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటూ, భవిష్యత్ పై వారికి బరోసా కల్సిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఒక వైపు లోకేష్ కు జనం బ్రహ్మరథం పడుతుంటే.. మరో వైపు పోలీసులు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నారు. అనుమతులు లేవంటూ సభలను అడ్డుకోవడం, ప్రచార వాహనాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై జనంల ఆగ్రహం వ్యక్తమౌతోంది.  

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.