Publish Date:Jun 29, 2022
ఈటల రాజేందర్ కు భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన జమునా హేచరీస్ కు చెందిన భూమిని అసైన్డ్ భూములంటూ 56 మంది రైతులకు ప్రభుత్వం పంచేసింది. కాగా రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ఈటల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు పంపిణీ చేయడం సంచలనంగా మారింది. ఇటీవల పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన ఈటల బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి వచ్చారు. రాజకీయ కారణాల కంటే ఈటల తన భూముల విషయంలో బీజేపీ అగ్రనేతల అండ కోసమే హస్తిన వెళ్లారని ఆప్పట్లోనే వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఈటల భూములను రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసినవే అని నిర్ధారించి ఆఘమేఘాల మీద రైతులకు పంపిణీ చేయడంతో బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఈటలకు ఎటువంటి అండా లభించలేదా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. ఇటీవల కొంత కాలంగా ఈటల మౌనం, బీజేపీతో అంటీముట్టనట్లు ఉన్న తీరుతో ఆయన బీజేపీలో ఇమడ లేకపోతున్నారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. అయితే అమిత్ షా రాష్ట్ర పర్యటనలో ఈటలతో మాట్లాడటం, ఆయన ప్రాధాన్యత ఉన్న నేతేనని చెప్పడంతో ఆల్ ఈజ్ వెల్ అన్న భావన కలిగింది. అయితే ఈటల భూములను ప్రభుత్వం పేదలకుపంచేయడంతో ఆయనకు బీజేపీ నుంచి ఎటువంటి సహకారం అందలేదని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దాదాపు రెండు నెలల నుంచీ కమలం పార్టీలో ఈటలను ఏకాకిని చేశారన్న ప్రచారం జరుగుతోంది. గుర్తింపు లేని చోట ఈటల మౌనంగా సర్దుపోవడానికి కారణం తనపై ఉన్న భూ కబ్జా ఆరోపణలేననీ, బీజేపీ అండతో వాటి నుంచి బయటపడాలని ఈటల భావించడమేనని కూడా అప్పట్లో పలువురు ఈటల సన్నిహితులు పేర్కొన్నారు. ఎంతగా సర్దుకు పోయినా ఈటలకు బీజేపీ అండగా నిలవలేదని ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన అధీనంలోని భూములను రైతులకు పంపిణీ చేయడమేనని అంటున్నారు. ఇక భూముల పంపిణీ విషయానికి వస్తే ఈటలకు చెందిన జమునా హేచరీస్ అధీనంలో ఉన్న 85 ఎకరాల 19 గుంటల గురువారం ప్రభుత్వం పేదలకు పంచేసింది. బీజేపీ అభ్యర్ధిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలిచినప్పటికీ.. ఆ గెలుపులో భీజేపీకి ఏమాత్రం భాగస్వామ్యం లేదనీ, అది పూర్తిగా ఈటల విజయమని అప్పట్లోనే విశ్లేషణలు వెల్లువెత్తాయి.
దీంతో ఆయన రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదుగుతారన్న భయంతో పార్టీలో ఆయన ఎదుగుదలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం అడ్డుకుందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ కారణంతోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అగ్ర నాయకత్వం వద్ద చక్రం తిప్పి ఈటల భూ కబ్జా ఆరోపణల విషయంలో పార్టీ నుంచి అండ అందకుండా చేసిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా ఈటల అధీనంలోని జమునా హేచరీస్ భూమిని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయడంతో ఈటల బీజేపీలో సౌఖ్యంగా, సౌకర్యంగా లేదనీ పార్టీతో ఆయన సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న వాదనకు బలం చేకూరినట్లైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jamuna-hatcheries-lands-distributed-to-farmers-big-shock-to-etala-39-138722.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.