ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్టు.. ఎందుకంటే?

Publish Date:Aug 8, 2026

Advertisement

కడప జిల్లాలోని జమ్మలమడుగు పట్టణంలో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో   అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ  వైపీపీ  చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.   నిరసన లో పాల్గొనేందుకు విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి,  ఆయన భార్య  ఇందిరమ్మతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలను  పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. 

డీఎస్సీ   నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలపై  వైసీపీ ఆధ్వర్యంలో జమ్మలమడుగులో చేపట్టిన నిరసన దీక్షలు శనివారం (ఆగస్టు 8) మూడో రోజుకు చేరుకున్నాయి.  అయితే ఈ దీక్షలకు  అనుమతులు లేకపోవడంతో పోలీసులు   నిరసనను   విరమించుకోవాలని   నోటీసులు జారీ చేసింది.

అయితే ఆ నోటీసులను బేఖాతరు చేస్తూ వైసీపీ   నిరసన దీక్ష కొనసాగించేందుకే నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి  దీక్షా శిబిరానికి చేరుకున్నారు.  అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.   అనంతరం ముందస్తు జాగ్రత్త చర్యగా పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా,  శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైసీపీ విమర్శించింది.   

Jammalamadugu Tension, YCP MLC,  Ramasubba Reddy Arrested, Kadapa News, DSC Recruitment Protest, TeluguOne

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.