దేశంలో 2022లో జమిలి ఎన్నిక ? రాష్ట్రాలు చుట్టేస్తున్న సీఈసీ అరోరా !

Publish Date:Dec 24, 2020

Advertisement

దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా?  మోడీ సర్కార్ అనుకుంటున్నట్లే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగబోతోందా ?  అసలు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా?  ఈ అంశాలపైనే గత ఏడాది కాలంగా  దేశంలో చర్చ జరుగుతోంది.  జమిలి ఎన్నికలు రాబోతున్నాయని కొందరు .. మన దేశంలో అలా నిర్వహించడం సాధ్యం కాదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు చూస్తుంటే దేశంలో 2022లోనే జమిలి ఎన్నికలు రావడం ఖాయమని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. గురువారం ఆయన హైదరాబాద్ కూడా వస్తున్నారు.  దేశంలో ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల కసరత్తులో భాగంగానే  సీఈవో రాష్ట్రాలు తిరుగుతున్నారనే చర్చ జరుగుతోంది. 

జమిలి ఎన్నికల గురించి జాతీయస్థాయిలో సీరియస్ చర్చే జరుగుతోంది. కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికల పాట పాడుతోంది. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. లోకసభకు, శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని 1982లో ఎన్నికల కమిషన్ ప్రతిపాదన చేసింది. 1999లో లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.  ప్రధాన మంత్రి ఈ అంశాన్ని తన ప్రసంగాలలోనూ, మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల్లోనూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. జమిలి ఎన్నికల మీద కేంద్ర ఎన్నికల సంఘం, లా కమిషన్ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఏయే పార్టీలు అనుకూలంగా ఉన్నాయో నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు  కసరత్తు కూడా మొదలు పెట్టింది.  దేశంలో జరిగే అన్ని ఎన్నికలకూ ఒకే ఒక ఓటరు జాబితా ఉండే విధంగా దృష్టి పెట్టింది. ఇన్నేళ్లూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ తయారు చేసిన జాబితా, మునిసిపల్‌, కార్పొరేషన్‌, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు లు సిద్ధం చేసిన జాబితాలను విడివిడిగా వాడుతున్నారు. 

జమిలి ఎన్నికలే నిర్వహించాల్సి వస్తే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని ఎలా ఖరారు చేయాలనేదాని మీద సందేహాలున్నాయి. కొన్నిచోట్ల మధ్యంతరంగా అసెంబ్లీని ముగించాల్సి వస్తుంది. మరికొన్నిచోట్ల గడువును పొడిగించాల్సి ఉంటుంది. ఇలాంటి లీగల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలో ఎలాంటి సవరణ చేయాలన్నదానిపై కూడా కసరత్తు జరిగింది. నీతి ఆయోగ్ అనేక కోణాల నుంచి ఆలోచించి నివేదికను రూపొందించింది. లా కమిషన్, ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేశాయి. రాజ్యాంగం నుంచి వచ్చే చిక్కులపై ఆటార్నీ జనరల్ నుంచి అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 2022 ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌ ఎన్నికలు జరుగునున్నాయి. 2022 అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలు జరగనున్నాయి. 2022 ,2023, 2024లో జరగాల్సిన ఎన్నికలను కూడా అవసరమైనంత కాలం వాయిదా వేయడమో, ముందుకు జరపడమో చేసి దేశ వ్యాప్తంగా లోక్‌ సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలను ఒకేసారి జరిపించాలన్నది మోడీ సర్కార్‌ వ్యూహం. 

 ఎన్డీఏ పక్షాలన్ని ఇప్పటికే జమిలి ఎన్నికలకు జై కొట్టగా.. యూపీఏ పక్షాల్లో కొన్ని వ్యతిరేకించగా.. మరికొన్ని ఏ నిర్ణయం చెప్పలేదు. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు సంబంధించి కేంద్రం నుంచి క్లారిటీ రావడం లేదు.  అందుకే టీఎంసీ, డీఎంకే  పార్టీలు జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, టీడీపీ, టీఆర్ఎస్ లు జమిలి ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరు నెలల నుంచే జమిలి ఎన్నికల గురించి చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కొద్ది రోజుల క్రితం జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.  2022 చివరలో జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రతిపాదిస్తోంది. దాని వల్ల కేసీయార్ అయితే ఏడాది పాటు అధికారం కోల్పోతారు. ఏపీలో ఏడాదిన్నర ముందే అధికారాన్ని వైసీపీ పోగొట్టుకోవాల్సివస్తుంది. అందుకే  వైసీపీ జమిలి ఎన్నికలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని భావిస్తున్నారు. 

 దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల అభిప్రాయాలూ తీసుకోవాలి. జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే దేశంలోని  రెండొంతుల రాష్ట్రాలు అందుకు అంగీకరించాలి. పార్లమెంటులో చర్చ జరగాలి. అక్కడా మూడులో రెండొంతుల అంగీకారం రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి అంగీకరించాలి. ఇక్కడ బీజేపీ తలచుకుంటే ఇవేమి అసాధ్యం కాదు. ప్రస్తుతం దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో అంగీకరిస్తే మొదటిదశ పూర్తయినట్టే. మిత్రపక్షాల మద్దతుతో అది కూడా పెద్ద సమస్య కాదు.  అందుకు బీజేపీ దగ్గర వ్యవస్థలున్నాయి.  పార్లమెంటులో చర్చించి వాటిని దారికి తీసుకురావడం పెద్ద సమస్య కాబోదు. అందుకే 2022లో  దేశంలో కచ్చితంగా జమిలి ఎన్నికలు జరగడం ఖాయమనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు సీఈవో రాష్ట్రాల పర్యటనకు ప్రాధాన్యత ఏమి లేదంటున్నారు  ఎన్నికల సంఘం అధికారులు రొటిన్ విజిట్ లో భాగంగానే ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.