జనం సొమ్ముతో జల్సాలు.. కోటలు కట్టిన జగన్ ఉన్మాదం!

Publish Date:Jun 23, 2024

Advertisement

పెద్దపెద్ద ప్యాలెస్ లు అంటే మనకు ఒక్కసారిగా గుర్తుకొచ్చేది రాజుల కాలమే. రాజుల కాలంలో వారు పరిపాలించే రాజ్యాలలో పెద్దపెద్ద ప్యాలెస్ లు నిర్మించుకుని, వాటిలో అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని.. శత్రు దుర్భేద్యంగా  తీర్చిదిద్దుకునేవారు. రాజుల ప్యాలెస్ లకు సంబంధించిన కథనాలు అనేక పుస్తకాల్లో చదివే ఉంటారు. కానీ, ఇప్పుడు పుస్తకాల్లో చదవాల్సిన పనిలేదు.. చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు.. ప్రజాధనంతో సిగ్గూఎగ్గూ లేకుండా రాజుల కాలంలో నిర్మించిన ప్యాలెస్ లను తలదన్నేలా ఏపీలో నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు చేపట్టింది ఎవరో కాదు.. ప్యాలెస్ ల పిచ్చోడు! అదేనండీ బాబూ.. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యర్థులు అతన్ని ముద్దుగా సైకోఅని కూడా  పిలుచుకుంటుంటారు. ఎందుకంటే అతను చేసే పనులన్నీ సైకో తరహా ఆలోచనలను పోలి ఉంటాయి. ఇప్పుడు ఆయన ప్యాలెస్ ల పిచ్చి ఉన్మాదాన్నిమించిపోయిందని బయటపడుతున్నది. ఆయన తనను తాను ఓ రాజుగా ఊహించుకుంటుంటారు. ఐదేళ్ల కాలంలో నేను రాజును.. ఏపీ ప్రజలంతా నా బానిసలు అన్న మాదిరిగా  జగన్ పాలన సాగించారు. రాజుల కాలంలో ప్రశ్నించిన వారికి ఎలాంటి దండనలు వేస్తారో.. ఇంచుమించు అదే తరహా దండనలు గత ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారు. 

జగన్ మోహన్ రెడ్డికి బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లి ప్రాంతాల్లోనే పెద్దపెద్ద ప్యాలెస్ లను తలపించేలా ఇళ్లు ఉన్నాయని ఏపీ ప్రజలకు తెలుసు. కానీ, జగన్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆయన ఏపీలో వెలగబెట్టిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు, రాజధాని అమరావతి  నిర్మాణానికి, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని చెబుతూనే.. రుషికొండపై దేశ ప్రజల కళ్లు చెదిరే స్థాయిలో 500 కోట్లు వెచ్చించి అత్యంత విలాసవంతమైన భవనాల్ని నిర్మించాడు. అందుకు వినియోగించిన సొమ్మంతా ప్రజలదే. తమ సొంత విలాసాల కోసం ప్రజలపై పన్నులు మోపి పీడించిన చందంగానే జగన్ తన విలాసవంతమైన భవనాల నిర్మాణం కోసం ప్రజల నడ్డి విరిచి, ముక్కు పిండి మరీ ధరల పెంపు, చెత్త పన్ను అంటూ వసూలు చేశారు. ప్రజా సొమ్ముకు జవాబుదారీగా ఉండి.. ప్రజలకు మేలు చేసేందుకు  వినియోగించాల్సిన సొమ్మును జగన్ మోహన్ రెడ్డి.. తనను తాను రాజుగా ఊహించుకొని రుషికొండపై పెద్దపెద్ద భవనాలు నిర్మించుకున్నాడు. అందులో నివాసం ఉండేందుకు విదేశాల నుంచి ఫర్నీచర్ ను తెప్పించి ఆ భవనాల్లో అమర్చాడు. కానీ, అధికారం కాల్పోవడంతో ఇప్పుడు దానిని ప్రజా ప్యాలెస్ అంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అవి చాలదన్నట్లుగా ప్రతీ జిల్లాలో  మైసూరు రాజమహల్ ని తలదన్నేలా పార్టీ కార్యాలయాల పేరిట నిర్మాణాలు చేపట్టారు.   ఆ నిర్మాణాలుకూడా ప్రభుత్వ భూముల్లో, అనుమతులు లేకుండా చేస్తున్నవి కావడం గమనార్హం. 

చేతిలో అధికారం ఉందని.. ప్రతీ జిల్లాలో పార్టీ కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూములను అధికారికంగా కబ్జా చేశారు. 33ఏళ్లు లీజు ముసుగులో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భములకు టెండర్ పెట్టారు. నగరాలు, పట్టణాల నడిబొడ్డు, జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కేటాయించుకొని, అందులో మైసూరు రాజమహల్ ని తలదన్నేలా భవనాల నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో రూ. కోట్ల విలువైన భూములను ఏడాదికి ఎకరానికి రూ. వెయ్యి చొప్పున లీజుకు తీసుకొని అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. 26 జిల్లాల్లో కలిపి 42.24 ఎకరాలు కేటాయించగా.. వాటి విలువ దాదాపు ఏడు వందల కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో ఒక్క ప్రకాశం జిల్లాలోనే అనుమతులు తీసుకొని భవనం కట్టారు. అమలాపురం పక్కనే ఉన్న జనుపల్లె, పాడేరుల్లో కోర్టు కేసుల వల్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. మిగతా 23 చోట్లా అనుమతులు లేకుండానే వైసీపీ పార్టీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే  తాడేపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని ఇటీవల అధికారులు కూల్చేశారు. వాటి తరహాలోనే అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో నిర్మించిన వైసీపీ కార్యాలయాలు కూల్చేయాలని, ఒకవేళ కార్యాలయం నిర్మాణం అయ్యి ఉంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి అప్పనంగా కొట్టేయాలని చూసిన ప్రభుత్వ భూములు, అందులోని నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా జగన్ అంటూ ప్రశ్నించారు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. మరో వైపు జగన్ ఐదేళ్ల కాలంలో దోచుకున్న ప్రజాసొమ్మును కక్కించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.