కాంగ్రెస్ సీనియర్ నేత జక్కడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.!

Publish Date:Aug 20, 2026

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 

ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలలో విభేదాలు, గ్రూపు తగాదాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత కొంత కాలంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి    నియోజకవర్గ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల పట్ల  అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని పలు సందర్భాలలో బాహాటంగానే వ్యక్త పరిచారు. అంతే కాకుండా పార్టీ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకిస్తూ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.  

కాగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్  తో ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభాకర్ రెడ్డి మద్దతుదారులు, అనుచరులు ఆయనపై సస్పెన్షన్ వేటుపై   అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నాయకులు  నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.  

Jakkidi Prabhakar Reddy, LB Nagar Congress, TPCC Suspension, Telangana Congress,  TPCC Disciplinary Committee

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.