చంద్రబాబుతో ములాఖత్ కు భువనేశ్వరికి అనుమతి నిరాకరణ

Publish Date:Sep 15, 2023

Advertisement

స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి చేసుకున్న ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. నిబంధనల మేరకు  వారంలో మూడు సార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నప్పటికీ భువనేశ్వరి దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు జైల్లో సరైన భద్రత కల్పించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయనకు కల్పించాల్సిన ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించలేదని.. తొలిసారి ములాఖత్ తరువాత  భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెవలుపై వెడుతుండటంతో అసలు రాజమహేంద్రవరం జైలులో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక తన ములాఖత్ దరఖాస్తున్న జైలు అధికారులు తిరస్కరించడంపై భువనేశ్వరి జగన్ సర్కార్ అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ములాఖత్ కు అవకాశం ఉన్నా తిరస్కరించడం కచ్చితంగా కక్ష సాధింపు ధోరణేనని అన్నారు.  

మరో వైపు చంద్రబాబుకు జైల్లో భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆయనను ప్రజలకు చూపాలని, ఆయన ఆరోగ్యపరిస్థితి, జైల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆయన నోటి వెంటే తెలుసుకుంటామని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఐయామ్ విత్ బాబు, ఇయామ్ విత్ సీబీఎన్, జైటీడీపీ, జై తెలుగుదేశం హ్యాష్ ట్యాగ్ లతో ఆ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.