Publish Date:Feb 25, 2012
హైదరాబాద్: ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి నోట జై సమైఖ్యాంధ్ర నినాదాలు వినిపించాయి. ప్రత్యేక తెలంగాణాకు వీర మద్దతుదారుడైన నారాయణమూర్తి విజయనగరం జిల్లాలో సమైఖ్యవాదుల ఒత్తిడికి తట్టుకోలేక జై సమైఖ్యాంధ్ర అంటూ నినాదాలిచ్చారు. నారాయణమూర్తి విజయనగరం జిల్లా బొబ్బిలిలో పీపుల్స్ వార్ చిత్ర షూటింగ్ జరుపుతున్నారు. ఇది తెలుసుకున్న సమైక్యవాదులు షూటింగ్ స్పాట్ కు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలిస్తూ తెలంగాణా మద్దతుదారుడైన నారాయణమూర్తి షూటింగ్ నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. దీనికి నారాయణమూర్తి తిరస్కరించడంతో సమైక్యవాదులు కోపోద్రిక్తులై షూటింగ్ ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంచెందిన నారాయణమూర్తి నేనూ ఆంధ్రావాడినే అంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పరుషంగా కూడా మాట్లాడారు. దీంతో తెలంగాణాలో ఆంధ్రావాళ్ళ షూటింగ్ లను అడ్డుకుంటున్న అంశాన్ని సమైక్యవాదులు ప్రస్తావిస్తూ దీనికి మీరేం సమాధానం చెబుతారని నిలదీయడంతో నారాయణమూర్తి చేసేదేమీ లేక జై సమైక్యాంధ్ర అంటూ వెళ్ళిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jai-samaikhyandhra-24-12184.html
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!