జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. జగ్గారెడ్డి మల్టీరోల్స్!

Publish Date:Apr 9, 2025

Advertisement

జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. పాలిటిక్స్‌కు టెంపరరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం కచ్చితంగా మంత్రి పదవి ఆయనకి దక్కేదన్న టాక్ ఉంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంగారెడ్డిలో గెలుపు మెట్లు ఎక్కిన జగ్గారెడ్డికి గత ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు.

పార్టీని, పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ లు పెట్టి మైకును మోత మోగించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారోనని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారట. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారోనని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి
ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆయన హైదరాబాద్ కి తిరుగు పయనం అయ్యారు. ఆ టూర్‌లోనే జగ్గారెడ్డిలో నిర్వేదం వచ్చి, కొత్త కొత్త అవతారాలు బయటపడుతున్నాయంట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్‌గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్‌ని రివీల్ చేస్తున్నారు.  వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ పర్యటన అనంతరం జగ్గారెడ్డి హైదరాబాద్‌ని పూర్తిగా వదిలేశారన్న ప్రచారం జరుగుతున్నది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికే ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసిన ఆయన సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రాం మందిరంలో రామభజన చేస్తూ భక్తిలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్‌ని పక్కన పెట్టి సంగారెడ్డిలో పండుగలు, భజనల్లో బిజీగా ఉన్నారంట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హొలీ వేడుకల్నీ అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న, పెద్ద, మిత్రులు, అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హొలీ అయ్యిందో లేదో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.

 అది అయిపోగానే ఉగాది వేడుకలు, శ్రీ రామ నవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇలా పండుగ ఏదైనా కేరాఫ్ జగ్గారెడ్డి  అనే విధంగా హడావుడి చేస్తున్నారంట. ఇక ఇన్నాళ్లు ఆయన్ని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలో ఇక సినిమా థియేటర్లలోనూ క్యారెక్టర్ యాక్టర్‌గా చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్తా భక్తిలో జగ్గానంద స్వామిగా మారడం... సినిమాలో జగ్గూభాయ్‌లా ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు, అనుచరులు ఖుషీలో ఉన్నా కాస్త కన్ఫ్యూజ్‌లో పడ్డారట. 

 పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందోనని అనుచర గణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరి కొందరు మార్పు వెనుక ఏదో మర్మం ఉందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారు. ఎప్పుడూ రాజకీయాల్లో తన మాటలతో తూటాలు పేల్చే జగ్గారెడ్డి.. మౌనంతోను రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారిప్పుడు. మరి రాజకీయాలు వదిలేసి రామ భజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్ళీ పొలిటికల్‌గా ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.