అసలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణా కాంగ్రెస్ ఆత్మరక్షణలో ఉండగా మరోవంక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం అంతకు మించి అన్నట్టు తయారయింది. నిత్యం వార్తల్లో ఉండే జగ్గారెడ్డి గత కొన్ని రోజులుగా మౌనం వహించారు. కనీసం గాంధీభవన్ మెట్లన్నా ఎక్కడం లేదు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత జగ్గారెడ్డి వ్యవహార శైలిలో ఊహించని మార్పే వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ అధినేతకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందువల్ల పార్టీ విషయాలు మీడియాకు చెప్పనని పేర్కొన్న ఆయన అప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలకు దూరం దూరంగానే ఉంటున్నారు. కాగా ఆమధ్య పార్టీ లక్ష్మణరేఖ దాటితే తల గోడకేసి కొడతానని రేవంత్ రెడ్డి అనడం జగ్గారెడ్డిని ఆగ్రహానికి ఆజ్యం పోసినట్టయింది. యశ్వంత్ సిన్హాను కలిసిన వి.హనుమంతరావును ఉద్దేశించే రేవంత్ ఆ విధంగా నోరుపారేసుకున్నాడని జగ్గారెడ్డి ఘాటుగానే విమర్శచేశారు. జగ్గారెడ్డి మౌనం మరింత విస్తరించి ఏకంగా మాణికం ఠాకూర్ తో పీసీసీ నాయకుల సమావేశానికి కూడా హాజరు కాలేదు.
అంతెందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలతో కాకుండా ఆయన విడిగా ఆఖరి నిమిషంలో వచ్చి ఓటేసి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు ఆయన ఏం చేయబో తున్నారు? ఆయన ఏం చెప్పబోతున్నారన్నది ఇప్పటికీ అందరికీ ఓ పజిల్ గానే ఉంది. సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజ రైన రోజు కూడా హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్ ముందు చేసిన ధర్నాలో పాల్గొనకుండా జగ్గన్న సంగారెడ్డిలో నిరసన దీక్ష చేశారు. ఈయన కూడా ఏదైనా పిడుగు లాంటి మాట చెబుతారమోనని తెలంగాణా పిసిసి నాయకులు ఖంగారుపడుతున్నారు.
మరో వైపు కొద్దితేడాతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెరాసాకు పిడగు పాటు వంటి కబురు అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే, ఆయన కొంతకాలం నుంచి బీజేపీ లో చేరుతారన్న ప్రచారం గట్టిగానే వినవస్తోంది. త్వరలో బీజేపీలో చేరడానికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం. వీరితో పాటు కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలకు చెందిన కీలకనేతలు కూడా క్యూ కట్టవచ్చని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
తెలంగాణా రాజకీయ రంగం వేడెక్కిన తరుణంలో కేసీఆర్ ముందస్తుకు సిద్ధపడితే తుమ్మల వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతోనే కార్యకర్తలను ఉత్సాహపరుస్తు న్నారని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తెరాసకు తుమ్మల, కాంగ్రెస్ కు జగ్గారెడ్డి ఇద్దరూ పిడుగులాంటి వార్తతో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించి కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలకు పెద్ద పరీక్ష పెట్టబోతున్నారని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jaggareddy-goodbye-to-congress-and-tummala-to-quit-trs-39-141181.html
Publish Date:Oct 11, 2026
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
Publish Date:Oct 11, 2026
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ