షర్మిలపై జగ్గారెడ్డి కౌంటర్లు.. ఏపీలో జగన్ కు ముచ్చెమటలు!

Publish Date:Sep 27, 2022

Advertisement

గదిలో స్విచ్ వేస్తే వరండాలో లైట్ వెలుగుతుంది. ఆ రెండింటికీ ఉన్న కనెక్షన్ అలాంటిది మరి. అలాగే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలను విమర్శిస్తే.. ఆ విమర్శలు నేరుగా జగన్ కు తగులుతున్నాయి.  జగన్, షర్మిలల మధ్య ఉన్నది అన్నా చెళ్లెళ్ల బంధం మరి. జగన్ కు సీఎం పదవి ఇవ్వాలని నేనూ సంతకం చేశానంటూ జగ్గారెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేరుగా జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన కోరిక మేరకే సంతకాల సేకరణ జరిగిందని జగ్గారెడ్డి చెప్పకనే చెప్పారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షిననీ అన్నారు. దాంతో గతంలో సంతకాల సేకరణ వాస్తవమే కానీ, ఆ విషయం జగన్ కు తెలియదంటూ అప్పట్లో  జగన్ సన్నిహితులు ఇచ్చిన వివరణలన్నీ అవాస్తవమని జగ్గారెడ్డి మాటలతో తేలిపోవడంతో ఇప్పుడు ఏపీలో జగన్ ఒకింత ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారనే చెప్పాలి.  వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల  కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో కనీసం ఆయనకూ క్లారటీ ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కోవర్ట్ అని ఆరోపణలు గుప్పించారు. మామూలుగానే జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్. ఆయన విమర్శలు చాలా ఘాటుగా ఉంటాయి. అటువంటి జగ్గారెడ్డికి షర్మిల తనను కేటీఆర్ కోవర్ట్ అంటూ విమర్శించడంతో ఆయనకు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది.  దాంతో జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు.

తెలంగాణలో షర్మిల రాజకీయ శక్తి కానే కాదని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు షర్మిల కంటే.. ఆమె సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు గట్టిగా తగిలాయి. జగ్గారెడ్డి వైఎస్ మరణించన నాటి సంగతులను ప్రస్తావించారు. వైఎస్ మరణించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలూ తదుపరి ముఖ్యమంత్రి విషయంపైనే దృష్టి పెట్టారనీ, కుటుంబ పెద్ద మరణించిన బాధ వారిలో ఇసుమంతైనా కనిపించలేదనీ చెప్పారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని కూడా చెప్పారు. వైఎస్ మరణించిన సందర్భంగా వారిని పరామర్శించడానికి వెళ్లి తాము ఏడ్చామే తప్ప ఆయన కుమారుడూ, కుమార్తెలలో బాధ అన్నది ఇసుమంతైనా కనిపించలేదన్నారు. వైఎస్ మరణించిన సమయంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ సంతకాలు పెట్టించిన వారిలో తానూ ఉన్నాననీ, సంతకాలు సేకరించమని తమకు ఆదేశాలు వచ్చాయనీ అన్యాపదేశంగా జగన్ ను ఉద్దేశించి ఆయన చెప్పారు. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలే సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. షర్మిల విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్ దుర్మరణం పాలైన విషాద సమయంలో, ఇంకా అంత్యక్రియలు కూడా జరగకుండానే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలతో నాడు జగన్ పై సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన మాట వాస్తవమేనని తేలిపోయిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జగ్గారెడ్డి మాటలు వాస్తవమేనని చెప్పేందుకు గతంలో వైఎస్ మరణం నాటి సంఘటనలను వివరిస్తూ నటుడు చిరంజీవి చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ప్రసంగంలో చిరంజీవి వైఎస్ అంత్యక్రియలు జరగకుండానే జగన్ సీఎం కావాలంటూ కొందరు సంతకాల కార్యక్రమం చేపట్టారనీ, అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న తనను కూడా సంతకం పెట్టాల్సిందిగా కోరారనీ వెల్లడించారు.

అప్పుడు తాను వారికి అది సబబు కాదనీ, విషాద సమయంలో రాజకీయం కోసం, పదవుల కోసం వెంపర్లాడటం తగదనీ చెప్పానని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో జగ్గారెడ్డి, షర్మిలల మధ్య విమర్శల యుద్ధంలో జగన్ కు గాయాలు తప్పడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  

By
en-us Political News

  
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.