మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స.!
Publish Date:Nov 11, 2026
Advertisement
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆయన.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై కుప్పకూలిపోయారు. కొద్దిసేపు స్పృహ కోల్పోయి పడిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ధన్‌ఖడ్‌ను తక్షణమే పోలీసు కంట్రోల్ రూమ్ (PCR) వాహనంలో ఆయన నివాసానికి తరలించారు. సమాచారం అందుకున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS) వైద్య బృందంతో పాటు ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ సందీప్ సేథ్ అక్కడికి చేరుకుని ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 75 ఏళ్ల జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్లో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కార్డియాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: 9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుక్కి రూ.2 కోట్ల బీఎండబ్ల్యూ గిఫ్ట్..! 2022 ఆగస్టులో భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌ఖడ్.. వ్యక్తిగత కారణాలతో 2025 జూలై 21న తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు మీకు నచ్చవచ్చు: ఓ రైడ్ కొడదాం గురూ.. నగరాల్లో బైక్ ట్యాక్సీల జోరు.. యువతకు చేతినిండా పని.! [ Jagdeep Dhankhar, former vice president, AIIMS Delhi, health update, morning walk collapse, cardiology department ]
కాగా, ధన్‌ఖడ్‌కు గతంలోనూ పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. 2025 మార్చిలో ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్లో చేరారు. ఆ సమయంలో ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స నిర్వహించారు. అదే ఏడాది జూన్‌లో నైనిటాల్ పర్యటన సందర్భంగా, ఈ ఏడాది జనవరిలో ఇంట్లో ఉన్న సమయంలోనూ ఆయన స్పృహ కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.
http://www.teluguone.com/news/content/jagdeep-dhankhar-25-236864.html





