జగన్ టార్గెట్ సీఐ నాగరాజు కాదు.. అప్పసాని రాజేష్!

Publish Date:Jun 20, 2026

Advertisement

 తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ కేసు తీవ్ర సంచలనంగా మారింది. కస్టడీలో ఉన్న యువకుడు సాయికృష్ణ అదృశ్యం కావడం లేదా మరణించి ఉంటాడనే అనుమానాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, ఈ కేసులో  వైసీపీ చేస్తున్న విమర్శల వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం,  హిడెన్ అజెండా ఉందన్నారు   ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, తెలుగుదేశం కూటమి అధికార ప్రతినిథి అప్పసాని రాజేష్.  తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.   కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 23 ఏళ్ల సాయికృష్ణ అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ఆచూకీ లభించకుండా పోయింది. ఈ ఉదంతంపై కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే విఆర్  కు పంపి, ఆపై సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

అయితే..  జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని  విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోనే  సిట్ విచారణ అత్యంత వేగంగా సాగుతోందని  గుర్తు చేశారు.

ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి నోటీసులు అందాయని, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు అరెస్టు చేశారనీ.. త్వరలోనే ఈ విచారణ తీగ లాగితే డొంకంతా కదిలినట్లు..  జగన్మోహన్ రెడ్డి ఇటికి చేరే అవకాశం ఉందని అన్నారు.   ఈ మద్యం కుంభకోణం విచారణను పక్కదారి పట్టించడానికి, సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సీపీ రాజశేఖర్ బాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే వైసీపీ  ఈ కేసును  రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని అప్పసాని  రాజేష్ అన్నారు.

గతంలో  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసును, డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ ఉదంతాలను ప్రస్తావిస్తూ.. ఆనాడు పౌర హక్కుల ఉల్లంఘనలపై స్పందించని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు హఠాత్తుగా మానవ హక్కుల నేతగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉందనీ, జూన్ 29వ తేదీ నాటికి పోలీసులు కోర్టుకు సమర్పించే నివేదికతో అసలు నిజాలు అధికారికంగా బయటకు వస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఈ కేసులో ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదనీ..  తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులేనని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేశారు.  సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో నిష్పాక్షిక విచారణ కమిషన్ కూడా ఏర్పాటైందనీ..  బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఒక యువకుడి అదృశ్యం కేసును అడ్డుపెట్టుకుని వైసీపీ ఆడుతున్న పొలిటికల్  డ్రామాను ప్రజలు గమనిస్తున్నారనీ, విచారణ పూర్తయితే అసలు నిజాలు నిగ్గు తేలుతాయని అప్పసాని చెప్పారు. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.