జగన్ బలప్రదర్శన బ్యాక్ ఫైర్.!
Publish Date:Jul 30, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన బలప్రదర్శన బ్యాక్ ఫైర్ అయ్యింది. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత నుంచి జనం మధ్యకు రావడం మానేసిన జగన్.. కేసులలో జైలు పాలైన వైసీపీ నేతల పరామర్శకు మాత్రమే బయటకు వస్తున్నారు. మిగిలిన సమయం అంతా బెంగళూరు ప్యాలెస్ కో, తాడేపల్లి ప్యాలెస్ కో పరిమితమౌతున్నారు. ప్రెస్ మీట్లతోనే గడిపేస్తున్నారు. అలా ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం పర్యటనలో కూడా అదే జరిగింది. బలప్రదర్శన ర్యాలీ కారణంగా అయన ఎందుకు వచ్చారో ఆ పని చేయలేకపోయారు. అసలు సీదిరి అప్పలరాజు ఎందుకరస్టయ్యారు అంటే.. అదేదో రాజకీయ కారణం కాదు. తన కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒక వ్యక్తి మరణానికి కారకుడైతే.. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తును పక్కదోవపట్టించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. ఒక క్రిమినల్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వచ్చారు. జైలులో ఉన్న అప్పలరాజును ములాఖత్ రోజున కలడానికి వచ్చిన జగన్ ఈ పర్యటనను బలప్రదర్శన వేదికగా మార్చుకోవాలని ప్రయత్నించారు. అందుకే విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఈ కారణంగా జగన్ జైలు ప్రాంగణం దగ్గరకు చేరుకునే సరికే సమయం గడిచిపోయింది. దీంతో జైలు అధికారులు అప్పలరాజును కలిసేందుకు జగన్ ను అనుమతించలేదు. దీని ఫలితంగా, జైలులో ఉన్న న మాజీ కేబినెట్ మంత్రిని కలవకుండానే వెనుదిరిగారు. YS Jagan Mohan Reddy, Seediri Appalaraju, Srikakulam jail meeting, YCP politics, Andhra Pradesh news, Telugu One
http://www.teluguone.com/news/content/jagans-show-of-strength-backfire-39-227596.html





