జగన్ బలప్రదర్శన బ్యాక్ ఫైర్.!

Publish Date:Jul 30, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన బలప్రదర్శన బ్యాక్ ఫైర్ అయ్యింది. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత నుంచి   జనం మధ్యకు రావడం మానేసిన జగన్.. కేసులలో జైలు పాలైన వైసీపీ నేతల పరామర్శకు మాత్రమే బయటకు వస్తున్నారు. మిగిలిన సమయం అంతా బెంగళూరు ప్యాలెస్ కో, తాడేపల్లి ప్యాలెస్ కో పరిమితమౌతున్నారు. ప్రెస్ మీట్లతోనే గడిపేస్తున్నారు. 

అలా ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం పర్యటనలో కూడా అదే జరిగింది. బలప్రదర్శన ర్యాలీ కారణంగా అయన ఎందుకు  వచ్చారో  ఆ పని చేయలేకపోయారు.  

అసలు సీదిరి అప్పలరాజు ఎందుకరస్టయ్యారు అంటే.. అదేదో రాజకీయ కారణం కాదు. తన కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒక వ్యక్తి మరణానికి కారకుడైతే.. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తును పక్కదోవపట్టించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. ఒక క్రిమినల్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వచ్చారు.  జైలులో ఉన్న అప్పలరాజును ములాఖత్ రోజున కలడానికి వచ్చిన జగన్ ఈ పర్యటనను బలప్రదర్శన వేదికగా మార్చుకోవాలని ప్రయత్నించారు. అందుకే విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఈ కారణంగా జగన్ జైలు ప్రాంగణం దగ్గరకు చేరుకునే సరికే సమయం గడిచిపోయింది. దీంతో జైలు అధికారులు అప్పలరాజును కలిసేందుకు జగన్ ను అనుమతించలేదు.   దీని ఫలితంగా, జైలులో ఉన్న  న మాజీ కేబినెట్ మంత్రిని కలవకుండానే వెనుదిరిగారు. 

YS Jagan Mohan Reddy, Seediri Appalaraju, Srikakulam jail meeting, YCP politics, Andhra Pradesh news, Telugu One

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.