పెట్టుబడిదారులను తరిమేసేందుకే జగన్ మావిగన్!

Publish Date:Apr 13, 2026

Advertisement

ప్రస్తతుం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మావిగన్ పై ఎడతెగని చర్చ జరుగుతోంది. వైసీపీయూలు మావిగన్ ను ఆంధ్రప్రదేశ్ ను సకల కష్టాల నుంచీ తొలగించే సంజీవనిలా, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ లా అభివర్ణిస్తుంటే.. తెలుగుదేశం కూటమి పార్టీలే కాకుండా, మేధావులూ, సామాన్య జనం కూడా మావిగన్ ప్రతిపాదన చేసిన  జగన్ ను ఓ జోకర్ గా అభివర్ణిస్తున్నారు. అదే తీరుగా నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం జగన్ మావిగన్ ప్రతిపాదన ఆషామాషీగా చేయలేదని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రతిపాదన వెనుక భారీ కుట్ర దాగుందని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మావిగన్’  వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందంటున్నారాయన. ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు.  విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.   జగన్  మావిగన్  వ్యూహం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉద్దేశించినదేనని విశ్లేషించారు.

ముఖ్యంగా పెట్టబడి దారులను బెదరించి వెనక్కు పంపడం కోసమే ఆయన మావిగన్ ప్రతిపాదన చేశారన్న ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి వస్తున్న పెట్టుబ డిదారులను భయభ్రాంతులకు గురిచేయడమే జగన్ లక్ష్యం అన్నారు. రాజధానిపై జగన్ తన వ్యతిరేకతను ఈ విధంగా వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకట్ట వేయాలన్న కుట్ర చేస్తున్నారన్నారు. 

సపోజ్ ఫర్ సపోజ్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి దారుణంగా మారుతుందని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, వేసిన రోడ్లను తవ్వేయడం, కేబుళ్లు,  పైపులను తరలించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని  ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా అమరావతిని గ్రాఫిక్స్ అని, స్మశానమని అభివర్ణించి పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడూ అదే చేస్తున్నారన్నారు.  

కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో పూర్తిస్థాయి నిబద్ధతతో లేదని విమర్శించిన ఏబీవీ.. ఢిల్లీ పాలకులు కేవలం తమ రాజకీయ అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, రైతుల త్యాగాలకు తగిన న్యాయం జరగడం లేదనీ చెప్పారు.   సీఆర్డీఏ  చట్టం ఉండటం వల్లనే ఇప్పటివరకు అమరావతి కొంతైనా నిలబడిందని చెప్పిన ఏబీవీ..  ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం రాజధాని పనులను 2028 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని కోరారు. అమరావతి కేవలం నగరం కాదనీ,  వేలాది మంది రైతుల నమ్మకమని అన్నారు.  

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.