బూమరాంగ్ అవుతున్న జగన్ బలప్రదర్శన యత్నాలు.!

Publish Date:Jul 16, 2026

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను చేసే ప్రతి పర్యటనలోనూ.. క్కడ అడుగుపెట్టినా బలప్రదర్శన చేయాలన్న ఆత్రం తప్ప.. తాను ఎందుకు పర్యటన చేస్తున్నారు అన్న ధ్యాస కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆయన బుధవారం (జులై 15) భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు.   రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి. దీంతో ఆశించిన సానుకూలతకు బదులుగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా బుధవారం (జులై 15)పర్యటనల్లోనూ అదే జరిగింది.  

ముందుగా ఆయన భీమవరంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి  రవాణా సమస్యలతో బాధపడుతున్న స్థానిక ఆక్వా రైతులకు మద్దతుగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. అయితే ఆయన భీమవరం పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్వయంగా జగనే దాని వల్ల ఇబ్బందులు పడ్డారు. సొంత మద్దతు దారులే ముందుకు తోసుకుని రావడంతో ఆయన వేదికపై బొక్కబోర్లా పడినంతపనైంది.  భీమవరం  సభకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో  తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై జగన్ చుట్టూ చేరిన అభిమానులు ఆయనను తాకేందుకు, ఆయన దృష్టిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి.

స్వయంగా తన మద్దతు దారుల తోపులాట కారణంగానే  జగన్ వేదికపై అదుపు తప్పి బోర్లా పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు కనుక సరిపోయింది కానీ.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పరిశీలకులు అంటున్నారు. 

 సరే బలప్రదర్శన కారణంగా భీమవరంలో జరిగిన నిర్వాకం చాలదన్నట్లుగా దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు కూడా జగన్ భారీ ర్యాలీతో వెళ్లారు. జగ్గయ్య పేట నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకున్న జగన్ పర్యటన అంత్యక్రియలకు వెడుతున్నట్లుగా కాకుండా ఏదో యుద్ధానికి వెడుతున్నారా అన్నట్లుగా భారీ ర్యాలీగా సాగింది.  మరణించిన నేతకు నిశ్శబ్దంగా నివాళు లర్పించాల్సిన   సమయంలో ఇలాంటి భారీ ప్రదర్శనలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేదిక వద్ద జగన్ రాకతో  హడావుడి, గందరగోళం నెలకొన్నాయి సీనియర్ నేత చివరి వీడ్కోలు కార్యక్రమం కాస్తా, రాజకీయ బలప్రదర్శనగా  ప్రదర్శనగా మారిందని ముద్రగడ అభిమానులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.  

YS Jagan Mohan Reddys tour, Bhimavaram aqua farmers protest, Mudragada Padmanabham's funeral, YSRCP turmoil

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.