జ‌గ‌న్ పసుపు చీర వ్యాఖ్య‌లు.. చెడుగుడాడేసిన చెల్లెళ్లు

Publish Date:Apr 26, 2024

Advertisement

అమాయ‌కమైన ముఖం పెట్టి అబ‌ద్ధాలను అల‌వోక‌గా చెప్ప‌డంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మించిన రాజ‌కీయ నేత మ‌రొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి  కాదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైన‌.. సొంత చెల్లెళ్ల‌పైన‌కూడా ఎలాంటి సంకోచం లేకుండా అధారాలు లేని అభాండాలను, అసత్య వ్యాఖ్యలను అలవోకగా  చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ దిట్ట.  తాజాగా వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసు విష‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అదే చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌త్య‌కు గురైన వివేకా కేసులో కీల‌క ముద్దాయిగా వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నారు. సీబీఐ సైతం వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ ప్ర‌మేయం ఉంద‌ని తేల్చింది.  అంతేకాదు.. క‌స్ట‌డీలోకి తీసుకొనే ప్ర‌య‌త్నం కూడా చేసింది. కానీ  తన అధికారాన్ని ఉపయోగించుకుని జగన్  అవినాశ్ అరెస్టు కాకుండా అడ్డుప‌డిన విష‌యం   తెలిసిందే.

ఒక‌వేళ ఆనాడు అవినాశ్ అరెస్ట్ అయ్యిఉంటే.. వివేకా హ‌త్య‌కేసులో జ‌గ‌న్‌, భార‌తీరెడ్డిల ప్ర‌మేయంకూడా వెలుగులోకి వ‌చ్చేది. వివేకా హ‌త్య కేసులో ప్ర‌మేయం ఉన్న అవినాశ్ రెడ్డికి జ‌గ‌న్ అండ‌గా నిల‌వ‌డంపై ఆయ‌న చెల్లెళ్లు వైఎస్ ష‌ర్మిల రెడ్డి, సునీతా రెడ్డిలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ వ‌ర్సెస్ ష‌ర్మిల, సునీత‌ల వ్య‌వ‌హారం  ఏపీ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా వివేకా హ‌త్య‌కేసు విష‌యంపై చెల్లెళ్ల వ్యాఖ్య‌ల‌కు పెద్ద‌గా స్పందించ‌ని జ‌గ‌న్‌.  పులివెందుల స‌భ‌లో ఎదురుదాడి చేశారు. వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ ప్ర‌మేయం లేదంటూ .. ఆయ‌న ఓ చిన్న‌పిల్లోడు అని జ‌గ‌న్ చెప్ప‌డం అంద‌రినీ విస్మయపరిచింది. అంతేకాదు.. ప‌సుపు చీర క‌ట్టుకుంటే చంద్ర‌బాబు మ‌ద్ద‌తుదారులే అన్న‌ట్లుగా జ‌గ‌న్ మాట్లాడ‌టం చూస్తుంటే ఆయ‌నలో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా,  ఎవ‌రు ప్ర‌శ్నించినా దాని వెనుక తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఉన్నాడ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌గ‌న్‌కు అల‌వాటుగా మారింది. చంద్ర‌బాబు పేరు ఎత్త‌కుండా జ‌గ‌న్ నిద్ర‌పోయిన రోజు లేద‌న‌డంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఇటీవ‌ల బ‌స్సు యాత్ర‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు జ‌గ‌న్‌పై రాయిదాడికి పాల్ప‌డ్డారు. ఆ రాయి ఎటుపోయిందో దొర‌క‌లేదు కానీ, జ‌గ‌న్ కు కంటిపై భాగంలో గాయ‌మైంది. రాయి వేయించింది కూడా చంద్ర‌బాబే అన్న‌ట్లుగా వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేశారు. హత్యాయత్నం అంటూ బిల్డప్ ఇచ్చారు. అయితే చివరికి ఆ బిల్డప్ నవ్వుల పాలైంది. జగన్ ప్రతిష్టను పలుచన చేసింది. దీంతో వివేకా హ‌త్యకేసులో  అవినాశ్‌ను వెనుకేసుకొస్తున్న జ‌గ‌న్ రెడ్డిని గట్టిగా నిలదీస్తున్న తన చెల్లెళ్లు షర్మిల‌, సునీత‌లపై జగన్ ఎదురుదాడికి, దిగజారుడు విమర్శలకు, వ్యాఖ్యలకు తెగబడ్డారు. వారు సంధించే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేని జ‌గ‌న్‌.. వారి వెన‌క ఉందికూడా చంద్ర‌బాబే అని పులివెందుల స‌భ‌లో మాట్లాడ‌టం ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప‌సుపుపచ్చ చీర కట్టుకొని, చంద్ర‌బాబు ఇచ్చిన స్క్రిప్ట్ లు చ‌దువుతున్నారంటూ త‌న చెల్లెళ్ల‌పై అడ్డ‌గోలుగా జ‌గ‌న్ నోరుపారేసుకున్నారు. ప్ర‌తిప‌క్షాల‌పై అంటే రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేశార‌ని అనుచోవ‌చ్చు.. కానీ,  వివేకా హ‌త్య‌కేసులో న్యాయంకోసం పోరాడుతున్న చెల్లెళ్ల‌పైనా జ‌గ‌న్ ఇష్టానుసారంగా మాట్లాడ‌టం ప‌ట్ల‌ క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. పులివెందుల స‌భ‌లో జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీత‌లు స్పందించారు.. అన్న‌మాట్లాడిన ప్ర‌తిమాట‌ను గుర్తుచేస్తూ.. దానికి స‌మాధానం చెబుతూ జగన్ ను చెడుగుడు ఆడేశారు. 


ప‌సుపుపచ్చ చీర క‌ట్టుకున్న‌వారంతా చంద్ర‌బాబు మ‌నుషులే అని జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం చేశారు. నేను పసుపుపచ్చ చీర కట్టుకున్నానట, చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానట. పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైటా ?   కలర్ కొన్నారా..? గతంలో సాక్షి ఛానెల్‌కి పసుపు రంగు ఉండేది కాదా..? జగన్ రెడ్డి ఈ విషయాన్ని ఎలా మరిచిపోయాడు అంటూ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ప‌సుపు మ‌నం వంట‌ల్లో కూడా వేస్తాం.. అలాని వైసీపీ శ్రేణులు ప‌సుపు వాడొద్ద‌ని జ‌గ‌న్ చెప్ప‌గ‌ల‌రా? పసుపు మంగళకర‌మైన రంగు అని స్వయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.  వైఎస్సార్ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారని ష‌ర్మిల గుర్తు చేశారు. అయినా, ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్నవ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గునా అంటూ ష‌ర్మిల నిల‌దీశారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్ర్కిప్ట్ ను చెల్లెళ్లు చదువుతున్నార‌ని జ‌గ‌న్ అన‌డంపై ష‌ర్మిల మండిప‌డ్డారు. స‌భ‌లో ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్ట్ ను మ‌క్కీకి మ‌క్కీ చ‌దివే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ త‌న‌ను చూడటం లేదని అనుకుంటుంద‌ట‌.. అలా ఉంది జ‌గ‌న్ తీరు అంటూ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. 

పులివెందుల స‌భ‌లో జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై వివేకానందరెడ్డి కుమార్తె సునీత‌రెడ్డికూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల రాయిదాడి ఘ‌ట‌న‌లో జ‌గ‌న్‌కు కంటి పైభాగంలో చిన్న‌ గాయ‌మైన విష‌యం తెలిసిందే. గాయ‌మై వారం రోజులు అవుతున్నా జ‌గ‌న్ క‌ట్టుమాత్రం తీయ‌డం లేదు. ఎన్నిక‌ల ప్ర‌చారం పూర్త‌య్యే వ‌ర‌కూ జ‌గ‌న్ ఆ క‌ట్టును అలానే ఉంచుతారా అనే డౌట్ ను ఏపీ ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే విష‌యంపై సునీతారెడ్డి మాట్లాడారు.. జ‌గ‌న్ కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది. వైద్యులు స‌రైన స‌ల‌హా ఇవ్వ‌లేద‌నుకుంటా.. జ‌గ‌న్ త్వ‌ర‌గా బ్యాండేజ్ తీయాల‌ని ఒక డాక్ట‌ర్ గా స‌ల‌హా ఇస్తున్న‌ట్లు సునీతా రెడ్డి సూచించారు. జ‌గ‌న్ పులివెందుల స‌భ‌లో ష‌ర్మిల‌ను, న‌న్ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌డం, ఐదేళ్లుగా నా తండ్రి హ‌త్య‌పై పోరాడుతుంటే రాజ‌కీయాలు అంట‌గ‌ట్ట‌డం నాకు బాధేసింది. సీఎంను ప్రాధేయ‌ప‌డుతున్నా.. ఇప్ప‌టికైనా నా పోరాటానికి స‌హాయం చేయండి అంటూ జ‌గ‌న్ రెడ్డిని సునీతా కోరారు. మొత్తానికి ఎన్నిక‌ల వేళ అవినాశ్ రెడ్డిపై ష‌ర్మిల‌, సునీత రెడ్డిలు చేస్తున్న వ్యాఖ్య‌ల్లో నిజం ఉంద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని భావించిన జ‌గ‌న్‌.. పులివెందుల స‌భ వేదిక‌గా వారిపై ఎదురుదాడి చేయ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని సీబీఐ చెబుతున్నా జ‌గ‌న్ మాత్రం ఆయ‌న్ను వెనుకేసుకొని రావ‌డాన్ని క‌డ‌ప ప్ర‌జ‌లు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.

By
en-us Political News

  
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది.
 ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. 
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.