జగన్ లో భయం.. బాబులో ఆత్మవిశ్వాసం.. గడప గడపకూ వర్క్ షాప్ తేల్చిందిదే!

Publish Date:Oct 1, 2022

Advertisement

వచ్చే ఎన్నికల్లో యవతకు సీట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించేశారు. ఆ క్రమంలో అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు.. ఇప్పటికే తన వారసులను ఎన్నికల బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  

ఏ ప్రాంతంలో..... ఏ నియోజకవర్గంలో యువతను బరిలో దింపితే..  పార్టీ గెలుపు తథ్యం అనే కోణంలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు పార్టీలో పలువురు సీనియర్ల నేతల వారసుల పేర్లతో ఓ జాబితా ఇప్పటికే సిద్దం చేశారని తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌ ఇద్దరూ పోటీ చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. అయితే గత ఎన్నికల్లో వారి కుమారులు జేసీ పవన్ కుమార్ రెడ్డి, జేసీ ఆస్మిత్ రెడ్డిలను బరిలోకి దింపిగా.. వారు ఓటమి పాలైయ్యారు.

మళ్లీ అలాంటి పరిస్థితి  రాకుండా ఉండేందుకు చంద్రబాబు.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 70 సీట్లు యువతకు కేటాయించినా.. మిగిలిన సీట్లు పార్టీ కోసం కష్టించిన వారికి కేటాయించినా.. పార్టీకి మేలు జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు 2024 ఎన్నికల్లో యువత ఓట్లు భారీగా పెరగనున్నాయని సమాచారం. ఇవి టీడీపీ గెలుపునకు దోహదపడతాయని అంటున్నారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చంద్రబాబు అసెంబ్లీ అభ్యర్థులను నిర్ణయించేసిన సంగతి విదితమే.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్  గడప గడపకు కార్యక్రమంపై నిర్వహించిన  వర్క్ షాపులో   వచ్చే ఎన్నికలు చాలా టఫ్‌గా ఉంటాయని.. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో మళ్లీ మీరే పోటీ చేయాల్సి ఉంటుందని సీనియర్లకు సీఎం జగన్ ముఖం మీదే చెప్పాశారు. అలాగే నాయకుల వారసులకు మాత్రం నో ఛాన్స్ అని స్పష్ఠం చేసేశారు. అయితే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వారసులను మాత్రం పంపవద్దని... కావాలంటే మీతోపాటు వారిని  వెంట తీసుకు వెళ్లాలని అంతేకాని వారసులను రంగంలోకి దింపి.. మీరు మాత్రం సైలెంట్‌గా ఇంటి వద్ద ఉంటే.. పరిస్థితులు మరోలా మారే అవకాశం లేకపోలేదని వివిధ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సీఎం జగన్ కర్తవ్య బోధ చేశారు.

అయితే వైయస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాల పేరిట.. లబ్దిదారుల ఖాతాల్లో నగదు వేయడమే కానీ.. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అభివద్ధి పని జరగలేదన్న సంగతి ప్రజలందరికీ తెలిసిందేనని  సరిగ్గా ఇదే విషయాన్ని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ రైట్ హ్యాండ్ రిష్ రాజ్ సింగ్... సైతం స్వయంగా సీఎం జగన్‌కు అందించిన నివేదికలో ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం పలువురు మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టి.. చేసిన వ్యాఖ్యలు సైతం   ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మారాయని వారు చెబుతున్నారు. అలాగే వైయస్ జగన్ ప్రతిపక్షంలో  ఉండగా.. రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చి... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ ప్రకటించడం.. దీంతో అమరావతి ప్రాంత రైతులు.. ఆందోళనలు, దీక్షలతోపాటు మహాపాదయాత్రులు.. చేస్తున్నారని.. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ పుట్టిముంచుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.