అక్క చెళ్లెమ్మలపై ఇన్ని ఘోరాలు.. జగనన్నా ‘దిశ’ ఏందన్నా!

Publish Date:Apr 28, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనతో రాష్ట్రంలో అక్క చెళ్లెమ్మలకు భద్రత కరవైంది.  రోజుకోచోట అక్క చెళ్లెమ్మలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి మాత్రం వాటిపై నోరు మెదపడం లేదు. నిందితులపై చర్యలకు ఆదేశించడం లేదు. 

రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటూ ఘనంగా ప్రకటించి.. ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే నిందితులపై కఠిన చర్యలకు ఏకంగా దిశ చట్టాన్నే తీసుకువచ్చామని చెప్పిన జగన్ ఇప్పుడా చట్టం ఏం పని చేస్తున్నది, ఎక్కడ పని చేస్తున్నదో చెప్పాల్సిన అవసరం ఉందని విపక్షాలు నిలదీస్తున్నాయి.
అత్యాచార కేసుల్లో నిందితులు దర్జాగా ఎస్పీ కార్యాలయంలో కూర్చుంటున్నారు, బాధితురాలి బంధువులు సంబధీకులూ న్యాయం కోసం కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నా ఫలితం ఉండటం లేదు. పాలనా రాహిత్యానికి పరాకాష్టగా ఈ ప్రభుత్వ పని తీరు ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. రోజా వంటి మంత్రులు మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్నారు.
  ఒక అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి నాగమ్మ, తాజాగా తెనాలి.. ఇలా మహిళలు బలౌతుంటే.. దిశ చట్టం అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించిన సీఎం మౌనం  దారుణమని అంటున్నారు. 

ప్రభుత్వ పరంగా బాధితులకు ఓదార్పు ఇవ్వడం, స్వాంతన కలిగించే చర్యలు తీసుకోవడానికి ముందుకు రాని ముఖ్యమంత్రి విపక్ష నేతలు బాధితులను పరామర్శించడానికి వెళ్లేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విపక్ష నాయకులు లోకేష్ విమర్శించారు. బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై రాళ్ల దాడి జరగడం తెలిసిందే. రాళ్ల దాడులకు భయపడేది లేదన్న ఆయన అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి ప్రభుత్వం రాకపోవడం ఒక దారుణమైతే...హత్యాచారానికి గురైన యువతికి కనీసం పోస్టు మార్టం చేయకుండా పోలీసులు అత్యాచారం జరగలేదనీ, అక్రమ సంబంధమే హత్యకు కారణమనీ ప్రకటనలివ్వడం ఏంటని నిలదీశారు.  

అత్యాచారాల విషయంలో నోరు మెదపని నేతలు విపక్ష నేతల పరామర్శలను అడ్డుకోవడం దృష్టి మళ్లింపు రాజకీయం తప్ప మరొకటి కాదని పరిశీలకులు చెబుతున్నారు. అత్యాచార సంఘటనపై దృష్టి మళ్లించడానికే దాడులు చేస్తున్నారనీ, దీని ద్వారా ప్రజల దృష్టి ఘటనపై నుంచి మరలి..అధికార విపక్షాల మధ్య ఘర్షణపై కేంద్రీకృతం అవ్వాలన్నదే దాడులకు పాల్పడే వారి ఉద్దేశమని వారు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వాధినేత బాధితులను పరామర్శించరు, వారికి అండగా నిలుస్తామన్న మామీ ఇవ్వరు.. విపక్ష నేతలను పరామర్శకు వెళ్ల నివ్వరు.. దాడులకు పాల్పడతారు.. అంటే అత్యాచారాలు జరిగినా ఎవరూ మాట్లాడకూడదు, ఆల్ ఈజ్ వెల్ అంటూ మిన్నకుండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని అంటున్నారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. అత్యాచార ఘటనల్లో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వైసీపీకి చెందిన వారే కావడం వల్ల పోలీసులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాల ఎస్పీలఅప్రైజల్ జాబితాను తన వద్ద ఉంచుకుని జగన్  వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ అధికార పార్టీకి తొత్తులుగా మారేలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పోలీసు అధికారుల అప్రైజల్ జాబితా సీఎం తన వద్ద పెట్టుకున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనని వివ్లేషకులు చెబుతున్నారు. 
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేయడం వల్లనే ఆడబిడ్డలపై అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతికల్లో ప్రకటనలు, గంభీర ప్రసంగాలకే ‘దిశ’ చట్టం పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగనన్నా ‘దిశ’ ఏందన్నా అని జనం ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికైనా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. 

By
en-us Political News

  
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.