అనడం ఎందుకు.. అనిపించుకోవడమెందుకు?.. జగన్ VS పవన్

Publish Date:Jul 1, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల వ్యవధి ఉన్నా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కోయిలలు తొందరపడి ముందే కూస్తున్నాయి. అధికారపార్టీ వైసీపీ సహజ ప్రత్యర్థి అయిన టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించడం గతంలో చూశాం. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వైసీపీ, జనసేనల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటోంది. పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్రలో జనసేనాని చేస్తున్న వ్యాఖ్యలపై స్థానిక నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ పై ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్న సభల్లో కూడా జగన్ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.  ప్రభుత్వ పథకాల ప్రారంభ సభలు, పార్టీ కార్యక్రమాలు, ఇలా ప్రతి చోటా జగన్ పదునైన వ్యాఖ్యలతో పవన్ పై విరుచుకుపడుతున్నారు. చివరికి పవన్ మాట్లాడే శైలిని కూడా జగన్ వదలడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే.. జనసేన నేతలు ఊరుకుంటారా? వారు కూడా దీటుగా జవాబివ్వడం మొదలు పెట్టారు. దీంతో ఎవరు ఎవర్ని ఏం తిడుతున్నారో? ఎందుకు తిడుతున్నారో అనేది అర్ధం కావడం లేదు. అయితే శుక్రవారం (జూన్ 30) భీమవరం సభలో  మాట్లాడిన పవన్ తాను నోరు విప్పితే జగన్ బాగోతం బయటపడుతుందని హెచ్చరించారు.  మరో అడుగు ముందుకు వేసి జగన్ చేసిన దుర్మార్గాలు బయటపెడితే జగన్ తట్టుకోలేరంటూ సెటైర్లు వేశారు.  జగన్ వ్యక్తిగత జీవితం చిట్టా, అరాచకాల చిట్టా, తన దగ్గర ఉన్నాయని పవన్ చెబుతున్నారు.  తెలుసుకోవాలనుకున్న వారికి జగన్ చరిత్ర చెబుతానని పవన్ బహిరంగంగా ప్రకటించారు. 

అయినా జగన్ జీవితం తెరిచిన పుస్తకమేనని ఆయన పార్టీ నేతలే అంటున్నారు. పవన్ ఏం చెబుతారు, 2004 నుంచి 2009 వరకూ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని  జగన్ చేసిన అక్రమాల గురించి చెబుతారా? అదంతా ప్రజలకు తెలిసిందే కదా. 2004లో పరిటాల హత్య వెనుక జగన్ ఉన్నారని పవన్ చెబుతారా? ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. 2005లో బాబాయి వివేకాని కడప ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేసి ఢిల్లీ పంపారని చెబుతారా? బెంగళూరు ఎలహంకలో పాతిక ఎకరాల్లో నిర్మించిన ప్యాలెస్ గురించి చెబుతారా? 2019 ఎన్నికలలో తనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్ స్వయంగా అంగీకరించి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారని చెబుతారా? నూటికి 15 మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎలా ఎదిగారని అడుగుతారా?  నవరత్నాల ఆశచూపి నాలుగేళ్లుగా ఆంధ్రప్రజలకు నవ దరిద్రాలను చూపిస్తున్నారని చెబుతారా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటూ రాష్ట్రాన్ని మద్యంలో ముంచేశారని చెబుతారా? స్వంత పినతండ్రి ప్రాణాలకు, స్వంత పార్టీ ఎంపీ కుటుంబ భద్రతకు, దళితుల ప్రాణాలకు ఏపీలో దిక్కులేదని చెబుతారా? అవినాష్ రెడ్డిని కాపాడు కోవడానికి అన్ని అడ్డదారులు ఎందుకు తొక్కుతున్నావ్ జగన్ అని అడుగుతారా?

రాష్ట్రంలో సహజవనరులన్నీ దోచుకుంటూ ఈర్థిక స్థితిని దిగజార్చిన విషయం గురించి అడుగుతారా? రాష్ట్రంలో భూమిని, ఇసుకని, అడవిని, గనులను అప్పనంగా అప్పడంగా నమిలేశారని అడుగుతారా? రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకుండా సరిహద్దుల్లో బాంబులు పట్టుకుని జగన్ కాపలా కాస్తున్నారని నిలదీస్తారా? తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రంలో బతకమని ఎందుకు తరిమేశావ్  అని జగన్ని అడుగుతారా? పేరు పక్కన రెండక్షరాలు లేకపోతే ఎలాంటి అవకాశాలూ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నావని మా జగన్ ను అడుగుతావా? నెలనెలా డబ్బులు పంచడం తప్ప మరో అభివృద్ధి కార్యక్రమం చేతకాని జగన్ పరిస్థితిపై నిలదీస్తావా? హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తులను, హక్కులను కేసీఆర్ కు ఎందుకు రాసిచ్చేశావ్ అని నిలదీస్తారా? జిల్లాకో గూండాని తయారు చేసి రాష్ట్రమంతా  పులివెందుల పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడాన్ని ప్రశ్నిస్తారా పవన్ గారూ అంటూ వైసీపీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.  

జగన్ దుర్మార్గాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవని వైసీపీ అభిమానులే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ-టీడీపీ మధ్య సాగాల్సిన పొలిటికల్ వార్ వైసీపీ్ర జనసేనల మధ్య జరగడం వెనుక బీజేపీ వ్యూహం ఉందేమో అన్న అనుమానం కొంతమంది విశ్లేషకుల్లో మొదలైంది. అదలా ఉంటే.. ఈ విషయాలు తెలియనిదెవరికంటూ అంతా నవ్వుకుంటున్నారు.

By
en-us Political News

  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.