దసరాకు విశాఖకుజగన్ నిజమేనా? డిసెంబర్ అంటారేంటి?

Publish Date:Oct 13, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహమో, అలవాటో తెలియదు కానీ ఆయన చెప్పినదేదీ చేయరు. అన్న మాట నిలబెట్టుకోరు. నాలుగేళ్లుగా ఆయన పాలన తీరు ఇలాగే ఉంది. ప్రజలకు అరచేతిలో వైకుఠం చూపించి.. వాస్తవంలో నరకయాతన పెడుతున్నారు. బటన్ నొక్కి డబ్బులు పందేరం చేస్తున్నామంటారు కానీ.. ఆయన నొక్కిన బటన్ బాపతు సోమ్ములు ఎప్పుడు ఖాతాల్లో పడతాయా అని లబ్ధిదారులు నెలల తరబడి వేచి చూడాల్సిందే.  ఇక ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన పెన్షన్లు ఏ నెలకాల సకాలంలో పడి చాలా చాలా కాలమే అయ్యింది. ఒకే సారి జీతాల పంపిణీ అన్నది అసలు లేనే లేదు. 

ఇక ఆయన మూడు రాజధానుల ముచ్చట అన్నది అంతం లేని కథలా నాలుగున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. కోర్టులు కూడదంటున్నా.. ఆయన ఆ పాట పాడుతూనే ఉన్నారు. తాజాగా దసరా నుంచి తన మకాంను విశాఖకు మార్చేస్తామని గట్టిగా చెప్పారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లూ కూడా జరిగిపోతున్నాయి. 

జగన్ విశాఖ మకాం గురించిన వార్తలు గత నాలుగేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. మార్చి పోతే సెప్టెంబర్ ఉందిగా అన్నట్లు ముహూర్తాలు ఖరారు అవుతూనే ఉన్నాయి. వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికల గడువు వచ్చేసింది. ఈ దసరాకు కాకపోతే సంక్రాంతికి అనే చాన్స్ లేదు. ఇక తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదలడమంటూ జరిగితే.. అధికారాన్ని వదులుకుని ఇంటికి వెళ్లిపోవడమే. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచే చాన్స్ అస్సలు లేదన్న విశ్లేషణలు, సర్వేలను బట్టి అలాగే అనుకోవాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

అందుకే ఇప్పుడు దసరా నుంచి విశాఖలోనే జగన్ అంటూ గట్టిగానే చెబుతున్నారు వైసీపీ నాయకులు.  ఇక దసరా  రోజుల్లోకి వచ్చేసింది.  ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ ఓ జీవో విడుదల చేసింది. అదీ జగన్ రెడ్డి విశాఖకు మకాం మార్చే విషయంలోనే. విశాఖలో సీఎంకు వసతి చూసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లుగా  జీవో జారీ అయ్యింది. వైసీపీ నేతలు, శ్రేణులూ ఇప్పటికే  జగన్ వసతికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని చెప్పేశారు. మరి తాజాగా ఈ జీవో ఎందుకని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పుడీ జీవో జారీ చేసి.. దసరా నాటికి  అంటే రోజుల వ్యవధిలోనే విశాఖలో జగన్ కోసం నివాస భవనం, క్యాంప్ కార్యాలయం ఇలా అన్నీ ఏర్పాటు చేసేస్తారా? అంటూ నిలదీస్తున్నారు.  నిబంధనలను తుంగలో తొక్కి మరీ రుషి కొండపై భారీ వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆయనకు కేటాయిస్తూ  సిఫారసు చేయించుకునేందుకే  జీవో జారీ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే జగన్ విశాఖకు మకాం మార్చేందుకు ముహూర్తం వాయిదా పడిందంటూ పార్టీ వర్గాల  నుంచి లీకులు  వస్తున్నాయి. దసరా నాటికి జగన్ విశాఖకు మకాం  మార్చే అవకాశం లేదనీ, అయితే డిసెంబర్ లో మాత్రం పక్కాగా ఆయన అక్కడి  నుంచే పాలన సాగిస్తారని అంటున్నారు.

 అయితే ఆయన విశాఖ నుంచి పాలన సాగించేందుకు దసరా ముహూర్తం వాయిదా పడటానికి అమరావతి కేసులే కారణమని అంటున్నారు. డిసెంబర్ లో సుప్రీం కోర్టులో ఈ కేసుల విచారణ జరుగుతుంది కనుక  కోర్టు  తీర్పు కోసం అప్పటి వరకూ వేచి చూడటమే మంచిదని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిజంగా కోర్టుల తీర్పులను గౌరవించి, ఆ ప్రకారం  నడుచుకునే పరిస్థితే ఉంటే ఊరికి ముందే విశాఖ నుంచి పాలన సాగించేందుకు ముహూర్తాలను నిర్ణయించడమెందుకు అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పుడు విశాఖ నుంచి పాలన కోసం సీఎం నివాసం, క్యాంపు ఆఫీసు కార్యాలయాలను ఎంపిక చేయడానికి కమిటీని నియమిస్తూ జీవో జారీ చేయడం, విశాఖ  పాలన ముహూర్తం మారిందంటూ ప్రకటనలు చేయడం వెనుక ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు కారణంగా ప్రజలలో వ్యక్తమౌతున్న ఆందోళన, ఆగ్రహాలను చల్లార్చి అందరి దృష్టీ జగన్ విశాఖకు  మకాం మార్చే విషయంపైకి డైవర్ట్ చేయాలన్న వ్యూహం ఉందని అంటున్నారు. అసలు రాష్ట్రంలో పాలనే లేదనీ, అలాంటి లేని పాలన ఎక్కడ  నుంచి సాగితే ఏముంది.. పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయి  అయితే ఏమిటి? అని జనం  అనుకుంటున్నారు. అసలు జగన్ అమరావతి నుంచైనా, విశాఖ నుంచైనా చేసిది ఏముంది..విపక్షాలను వేధించడం, ప్రజలను పీడించడం తప్ప అని జనం భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.