Publish Date:Jul 27, 2022
ప్రజలకు గతంలో తాను చెప్నిన మాటలు గుర్తుండవు అనుకున్నారో ఏమో జగన్ పోలవరం నిర్వాసితుల విషయంలో గతంలో మాట్లాడిన దానికి పొంతన లేకుండా మాట్లాడారు. వారికి మతిమరుపు ఎక్కువ అని ఆయన భావం అయి ఉంటుంది. అందుకే పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ఆర్ ( రిహెబిలిటేషన్ అండ్ రీ సెటిల్ మెంట్) ప్యాకేజీ తన వల్ల కాదని చెప్పేశారు. కేంద్రమే ఇవ్వాలని కానీ కేంద్రం ఇవ్వడం లేదనీ నెపం కేంద్రం మీదకు నెట్టేశారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటే 20 వేల కోట్లు అవసరం అవుతుందని, అది కేంద్రం ఇవ్వాలే కానీ తన వల్ల ఎలా అవుతుందని బీద అరుపులు అరిచారు. పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయన బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పిన విషయాలివి. అయితే గతంలో అంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడిన విషయాన్ని పోలవరం నిర్వాసితులు గుర్తు చేస్తున్నారు.
గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు కేంద్రం ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు ఆ ఆర్థిక ప్యాకేజీలో ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజీని కూడా ఆ ఆర్థిక ప్యాకేజీలో చేర్చారు. అంతే వంద శాతం ప్రాజెక్టు వ్యయం కేంద్రమే భరించేలా ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే అప్పట్లో విపక్ష నేత హోదాలో జగన్ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు.అంచనాలు పెంచడాన్ని జగన్ గట్టిగా వ్యతిరేకించారు. చంద్రబాబు అవినీతి కోసమే అంచనాలు భారీగా పెంచేశారని విమర్శలు గుప్పించారు.
ఇదే విషయాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఫిర్యాదుల ఆధారంగానే కేంద్రం అంచనాలను తగ్గించేసింది. ఆర్ఆర్ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని కేంద్రం తేల్చేసింది. గతంలో అంటే జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది వేలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పది లక్షల సంగతి మరిచిపోయి ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఎకరాకు ఐదు లక్షలంటూ చెబుతున్నారు. తీసుకున్న అప్పుల లెక్కలు మార్చేసినట్లుగానే హామీ ఇచ్చిన పది లక్షలను వదిలేసి తానిచ్చిన హామీ ఐదులక్షలే అని చెప్పడానికి ఇసుమంతైనా సంకోచించడం లేదు.
జగన్ వైఖరిని పరిశీలకులు తప్పుపడుతున్నారు. జగన్ తన తీరుతో పోలవరం ప్రాజెక్టునూ, పోలవరం నిర్వాసితులనూ నిండా ముంచేశారని విమర్శిస్తున్నారు. ఇక జగన్ వ్యాఖ్యలు కేంద్రాన్నీ ఇరుకున పెట్టాయి. పోలవరం అంచనాల పెంపు వెనుక భారీ అవినీతి ఉందని, అంచనాలు పెంచవద్దని జగన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే అంచనాలను తగ్గించేశామని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు అదే జగన్ కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని కేంద్రంపై ఆరోపణలు చేయడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులకు జగన్ గతంలో చేసిన ప్రసంగాల, అప్పటి చంద్రబాబు సర్కార్ పై పోలవరం అవినీతిపై చేసిన విమర్శలను ప్రజలలోకి తీసుకువెళ్లి జగన్ వైఖరిని ఎండగట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-uturn-on-polavaram-expatriates-39-140694.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.