జగన్ ముందస్తు ముచ్చట..ఓ అంతులేని కథ

Publish Date:Jul 3, 2023

Advertisement

వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏం జరుగుతుందో ఏపీలో  హేతువుతో సంబంధం లేకుండా సాగుతున్న ఊహాగాన సభలను గమనిస్తు ఇట్టే అర్ధమైపోతుంది. ఈ ఏడాది చివరిలో దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది.

ఇక రెండు మూడు నెలలలో షెడ్యూల్ విడుదల కూడా జరిగిపోతుంది. అయినా ఏపీలో ముందస్తు ముచ్చటకు సంబంధించిన ఊహాగానాలూ, అంచనాలూ ఇసుమంతైనా ఆగడం లేదు. ఏపీ సీఎం స్వయంగా ముందస్తు ప్రశ్నే లేదు.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అని విస్పష్టంగా ప్రకటించినా.. పరిశీలకుల నుంచి, రాజకీయ విశ్లేషకుల దాకా, సామాన్య జనం నుంచి ప్రతి పక్ష పార్టీల వరకూ ఏపీలో ముందస్తు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు.

 తాజాగా మరో మారు ఏపీలో ముందస్తు ఎన్నికలపై మరో సారి విస్తృత స్థాయి చర్చలకు తెరలేచింది. ఇందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ హస్తిన పర్యటనకు ముహూర్తం ఖరారు కావడమే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు బీజేపీ కీలక నేతలు, మంత్రులతో కూడా భేటీ అవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మోడీ, షాల అప్పాయింట్ మెంట్ ఖరారైందని కూడా చెబుతున్నాయి. జగన్ ఈ పర్యటన విషయంలో బయటకు చెబుతున్న కారణాలు ఏపీకి రావలసిన అంశాలపై చర్చే అని చెబుతున్నా.. వాస్తవ కారణం మాత్రం ముందస్తు కోసం మోడీకి బతిమలాడుకోవడం కోసమేనని అంటున్నారు. అంతే కాకుండా మోడీ కూడా ముందస్తు యోచన చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జగన్ పర్యటన  రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ తన అప్పుల పరిమితి దాదాపు వాడేసుకుంది. ఎడాపెడా అప్పులు, కేంద్రం నుంచి ఉదారంగా నిధులూ వచ్చినా కూడా ఆగస్టు నుంచి ఉద్యోగుల జీతాలే కాదు, బటన్ నొక్కుడు సంక్షేమానికీ ఇబ్బందులు తప్పవు. దీంతో జగన్ కేంద్రం వద్ద మీరు ఆదుకోవాలి అంటూ వేడుకోవడం, అలాగే దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకుంటాను.. ముందస్తుకు అవకాశం ఇవ్వండి అని విజ్ణప్తి చేయడం వినా మరో గత్యంతరం లేదని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్  ఈ నెల5, 6 తేదీలలో హస్తినలో పర్యటించనుండటం ప్రభుత్వ పెద్దలతోనే కాకుండా, బీజేపీ అగ్రనాయకులతో కూడా సమావేశం కానుండటంతో.. మోడీ ప్రమేయంతో ముందస్తుకు అవకాశం దక్కేలా చేసుకుంటారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

2014 ఎన్నికలలో తన పార్టీని విజయ పథంలో నడిపించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆ తరువాత చుట్టూ సమస్యలు చుట్టుముట్టడంతో వ్యూహాత్మకంగా 2019 వరకూ ఆగకుండా ఆర్నెళ్లు ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2018లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం ఆయన అంతే వ్యూహాత్మకంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెడుతున్నారు.  ఇక జగన్ విషయానికి వస్తే 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆయన నాలుగేళ్లలోనే అంతులేనంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత  రోజు రోజుకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. అలా తగ్గే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. సంక్షేమం అంటూ బటన్లు నొక్కి లబ్ధి దారుల ఖాతాలలో సొమ్ములు వేస్తున్నా.. ఎక్కడా సంతృప్తి అన్నది ప్రజలలో మచ్చుకైనా కనిపించడం లేదు.

ఈ పరిస్థితుల్లో బటన్ నొక్కుడు కూడా కష్టమయ్యేలా భవిష్యత్ అద్దంలో కనిపిస్తుండటంతో జగన్ లో ఆందోళన పెరుగుతోంది. దీంతో  షెడ్యూల్ వరకూ వేచి చూడాలని ఆయన భావిస్తున్నా.. ముందస్తుకు వెళ్లకుంటే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనా ఆయనను వెన్నాడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హస్తిన పర్యటన వెనుక ముందస్తు మంతనాలు జరపడం అన్నదే ప్రధాన కారణమై ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.