Publish Date:Jan 23, 2026
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్నట్లుగా ఉంది జగన్ తీరు. తన హయాంలో సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. స్థలాల సరిహద్దులను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసే సర్వే రాళ్ల కోసం ఏడంగా ఏడువందల రూపాయలు వ్యయం చేయడం, ఖరీదైన గ్రానైట్ రాళ్లను వినియోగించడం అప్పట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆ రాళ్లపై జగన్ జగన్ ఫొటోలను ముద్రించడం కూడా పెను వివాదంగా మారింది. హైకోర్టు కూడా సర్వేరాళ్లపై జగన్ బొమ్మల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంపై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే భూముల రీసర్వేను పారదర్శకంగా చేపడతామనీ, అలాగే పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మలను తొలగిస్తామని అప్పటి విపక్ష నేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు పంపిణీ చేశారు. దీనిపై రైతులలో హర్షం వ్యక్తం అవుతోంది.
కానీ జగన్ మాత్రం తన తప్పులను తెలుగుదేశం ప్రభుత్వం సరిదిద్దడాన్ని సహించలేకపోతున్నారు. సరిహద్దురాళ్లు సరిగా లేవు, పాసుపుస్తకాలు కూడా తప్పుల తడకలా ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గురువారం (జనవరి 22) తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడిన జగన్ తన ప్రసంగం మొత్తం తెలుగుదేశం కూటమి చేపట్టిన భూముల రీసర్వేపైనే మాట్లాడారు.
అసలీ కార్యక్రమాన్ని చేపట్టినది తానేనంటూ క్రెడిట్ చోరీకి శతధా ప్రయత్నించారు. వాస్తవానికి భూముల రీసర్వే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అదే సమయంలో అప్పట్లో తన నిర్వాకం అదే ఫొటోల వ్యవహారం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నవ విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు. భూ యజమానులకు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలపై తన సొంత ఫోటోను ముద్రించడం పట్ల జగన్ ఈ సమావేశంలో ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అసలా ప్రస్తావన చేయడానికి కూడా సాహసించలేదు. అంతే కాదు తన హయాంలో సరిహద్దు రాళ్లపై తన పేరు, ఫోటో విషయాన్ని కూడా దాటవేశారు. దీంతో జగన్ మీడియా సమావేశంలో ప్రసంగం విన్నవారంతా తప్పులెన్నువారు అన్న వేమన శతకంలోని పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-unaware-of-his-own-mistakes-39-212919.html
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు.
Publish Date:Feb 28, 2026
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.