Publish Date:Jun 11, 2026
రాజకీయాల్లో ఏ ఎండకా గొడుగు పట్టడంలో వైసీపీ అధినేత జగన్ ది అందె వేసిన చెయ్యిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగుదేశం ఘనతలను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించిన జగన్ ఇప్పుడు.. నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై యువత ఆగ్రహం నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్‌ను చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నీట్ లీకేజీని ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల అంశానికి లింక్ చేసిమైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాడేపల్లిలో గురువారం (జూన్ 11) జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు రెండున్నర గంటల పాటు జగన్ రెండున్నర గంటల పాటు సాగిన మీడియా సమావేశంలో జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇది జెన్-జీ కాలం.. ఇప్పుడు జెన్-ఆల్ఫా కూడా నడుస్తోంది. ఏపీలో కూడా కాక్రోచ్‌లు బయటకు వస్తాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి ఆ రెండు జనరేషన్ల అర్థాలు ఏమిటి? అన్నది జగన్ కు ఎంత వరకూ తెలుసో కానీ, జగన్ మాత్రం తాను ఏపీ కాక్రోచ్ మూవ్ మెంట్ ను లీడ్ చేస్తానంటూ అన్యాపదేశంగా ప్రకటించేశారు.
అయితే దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది. ఈ డీఎస్సీ ప్రక్రియలో ఒక్కటంటే ఒక్క లీకేజీని కూడా జగన్ చూపించలేదు. ఆరోపణలు తప్ప ఆధారాలేవీ బయటపెట్టలేదు. అయినప్పటికీ.. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే.. ఏపీ యువత నమ్మేసి రోడ్లెక్కి చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేస్తారని ఆయన నమ్ముతున్నారు.
వాస్తవాలతో సంబంధం లేకుండా, ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నేత.. అసత్య ప్రచారాలతో జనాలను నమ్మించాలని చేస్తున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్త మౌతున్నాయి. ట్రెండ్ సృష్టించడమెందుకు.. ఫాలో అయితే పోలా అన్న చందంగా జగన్ .. కాక్రోచ్ జనతా పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ నీట్ లీకేజీకీ, ఏపీ డీఎస్సీకీ ముడిపెట్టి లబ్ధి పొందాలని చూసిన తీరును నెటిజనులు ఎండగడుతున్నారు. తాజా ప్రెస్ మీట్ లో జగన్ పదే పదే కాక్రోచ్ లు వస్తాయి అనడంతో నెటిజనులు వైసీపీ పేరును.. కాక్రోచ్ జగన్ పార్టీ అని మార్చేస్తారేమో అని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ కొత్తగా మొదలెట్టిన బొద్దింకల రాజకీయం ఏపీలో జగన్‌కు మైలేజీ ఇవ్వడం మాట అటుంచి.. జనంలో ఆయన నవ్వుల పాలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-turns-to---cockroach-39-222599.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.