జగన్ రోజు రోజుకూ ఓ ట్రోల్ ఐటెమ్ గా మారిపోతున్నారా?

Publish Date:Jul 2, 2026

Advertisement

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్.. రోజు రోజుకూ ఓ ట్రోల్ స్టఫ్ గా మారిపోతున్నారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన   మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే.. ట్రోలింగ్ కు, మీమ్స్ కు కావలసినంత స్టఫ్ దొరుకుతుందని నెటిజనులు సంబరపడిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రెస్ మీట్ లలో చేసే ప్రసంగాలు ఉంటున్నాయి.  జగన్ ప్రసంగాలు,  మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.

 నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.  అందుకు తగ్గట్టుగానే జగన్   వివాదాస్పదమైన, వినూత్నమైన ప్రకటనలు ట్రోలర్లకు, నెటిజనులకు కావలసినంత స్టఫ్ అందిస్తున్నాయి.  తాజాగా బుధవారం (జూన్ 1) జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో  అమరావతి వర్సెస్ 'మావిగన్' అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికే జగన్ మావిగన్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా అందరి హేళనలకూ గురై ఒక హాస్యాస్పద అంశంగా మారిపోయింది. అదలా ఉండగానే.. తన తాజా ప్రెస్ మీట్ లో జగన్  ఏకంగా మావిగన్ ను వచ్చే ఎన్నికల అజెండాగా ప్రకటించడం నెటిజనులకు పండుగలా మారింది. 

ఇక దీనిపై మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం దాటవేసిన తీరు కూడా ఆయనపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు కారణమైంది. సాధారణంగా ప్రెస్ మీట్లలో ఎదురయ్యే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పే జగన్, ఈసారి మాత్రం ఎన్నికల అజెండాగా మావిగన్ అంటూ చేసిన ఆయన ప్రకటనపై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం కూడా జగన్ పారిపోయారు అంటూ నెటిజనులు ట్రోల్ చేయడానికి కారణమైంది.  మావిగన్ ఎన్నికల అజెండా అయితే విశాఖ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు జగన్ నిరుత్తరుడై, కనీసం ఆ ప్రశ్న సంధించిన విలేకరి వైపైనా చూడకుండా.. హడావుడిగా ప్రెస్ మీట్ ను ముగించేయడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ జారుకున్నారనీ, ప్రశ్నలు వినిపించలేదన్నట్లు యాక్ట్ చేయడంలో జగన్  కమల్ హసన్ ను మించిపోయారనీ నెటిజన్లు వీర లెవెల్లో ఎగతాళి చేస్తున్నారు.  2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్.. ఆ ఐదేళ్లూ  విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అని, త్వరలోనే అక్కడి నుంచే పాలన సాగిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి అత్యంత ఆదర్శవంతమైన ఫార్ములా మూడు రాజధానులేననీ, అదే తాను చేస్తున్నాననీ చెప్పుకున్నారు.

అయితే మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలూ  2024 ఎన్నికలలో మూకుమ్మడిగా తిరస్కరించి, వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జగన్ తాజాగా విశాఖను, మూడు రాజధానులనూ వదిలేసి మావిగన్ అంటూ కొత్త రాగం అందుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తన తాజా ప్రెస్ మీట్ లో వైజాగ్ రాజధాని గురించి అడిగిన ప్రశ్న వినగానే..  ఏం చేస్తున్నాడో తెలియనట్లు రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడిచి వెళ్లిపోయారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  

By
en-us Political News

  
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.