తుగ్లక్ చేష్టలకు హేతువేంటి?

Publish Date:Oct 8, 2022

Advertisement

ఒకరు సాధించిన నేత.. మరొకరు దానం చేసిన దాత.. వారిపై జగన్ రెడ్డి అంత పగ ఎందుకు పెంచుకున్నారో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తుగ్లక్ పాలనలో కూడా ఇంతటి వికృత చర్యలు చూడలేదంటున్నారు. ఈ అరాచక పాలనకు అడ్డూ అదుపూ లేదా.. మహనీయుల పేర్లు మార్చడమేంటి? అంటూ ఏపీ జనం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. జగన్ చెప్పిన అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఆయా సంస్థలకు ఉన్న పేర్లను మార్చడమేనా అని ప్రతిపక్ష నాయకులు నిలదీస్తున్నారు. జగన్ తుగ్లక్ చర్యలకు అవాక్కవుతున్నారు ఆంధ్రా జనం. 

గతంలో 17 ఎకరాల భూమిని ఇచ్చిన అశోక్ గజపతి రాజు తండ్రి పీవీజీ రాజు పేరుతో 1983లో విజయనగరం ఆస్పత్రికి మహారాజా ఆస్పత్రిగా పేరుపెట్టారు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఈ ఆస్పత్రికి మహారాజా పేరు తొలగించిన జగన్ సర్కార్ 'ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి'గా మార్చడాన్ని చూసి జిల్లా జనం  భగ్గుమంటున్నారు.

 విపక్ష నేతల కుటుంబీకుల పేర్లతో ఉన్న సంస్థలను వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పేరు మార్చడం కక్షపూరిత చర్య అని,  ప్రముఖుల పేర్లపైనే ఇలా పగబట్టినట్టు వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. దశాబ్దాల నుంచి ప్రభుత్వ సంస్థలకు ఉన్న ప్రముఖుల పేర్లను ఒక్కొక్కటిగా వైసీపీ సర్కార్ తొలగిస్తుండడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల కుటుంబీకుల పేర్లతో ఉన్న సంస్థలను జగన్ సర్కార్ టార్గెట్ చేయడాన్ని తూర్పారపడుతున్నారు.

 విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును జగన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల మార్చేసిన సంగతి తెలిసిందే. వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టింది. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో టీడీపీ నేత పి. అశోక్ గజపతిరాజు వంశీయుల పేరుతో ఉన్న మహారాజా జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరును రాత్రికి రాత్రే మార్చేశారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి మహారాజా పేరు తొలగించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అంటూ బోర్డు పెట్టేశారు.

ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు 1983లో విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు తండ్రి పీవీజీ రాజు భూములు ఇచ్చారు. దీంతో మహారాజా జిల్లా ఆసుపత్రిగా అప్పట్లో దానికి పేరు పెట్టారు. వైద్య విధాన పరిషత్ లోకి వచ్చిన తర్వాత కూడా మహారాజా జిల్లా ఆసుపత్రిగానే దాని పేరును కొనసాగించారు.

విజయనగరంలోని ఆసుపత్రి మొదట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉండేది. అది ఇరుకుగా ఉండటంతో అభివృద్ధికి అవకాశం లేకపోయింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి కోసం 17 ఎకరాల స్థలాన్ని 1983లో పీవీజీ రాజు ఇచ్చారు. ఇందులోనే ప్రస్తుత జిల్లా కేంద్ర ఆసుపత్రి, భోధనాసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, డీసీహెచ్ఎస్ కార్యాలయం, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగం, క్షయవ్యాధి నివారణ కార్యాలయం, వాక్సినేషన్లు భద్రపర్చే భవనం, ఆయుర్వేద ఆసుపత్రి ఉన్నాయి. ఇలా అనేక విభాగాలు మహారాజా ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్నాయి.

 టీడీపీ నేతల కుటుంబీకులపేర్లను తొలగిస్తుండడంతో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. అధికార వైసీపీలో కూడా అభ్యంతరం వ్యక్తమైంది. అయినా పేర్ల మార్పు రాజకీయాన్ని   ప్రభుత్వం  కొనసాగిస్తుండడం  జగన్ తుగ్లక్ పాలనకు మరో నిదర్శనం అంటున్నారు.

By
en-us Political News

  
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.