జగన్ ఇక సర్దేసుకుంటున్నారా?

Publish Date:Oct 10, 2023

Advertisement

జగన్ సర్దేసుకుంటున్నారా? ఓటమి ఖeయమని నిర్ణయానికి వచ్చేసి.. ఇక తన హయాంలో జరిగిన అక్రమాలతో  తనకేమాత్రం సంబంధం లేదని పార్టీ నేతలకు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహం పీక్స్ కు చేరిందని గమనించి ప్రజలకు ముఖం చాటేయడానికే నిర్ణయించుకున్నారా? అయినా వచ్చే ఎన్నికలలో విజయం మనదే అని పార్టీ నేతలను క్యాడర్ ను నమ్మించడానికి విస్తృతస్థాయి సమావేశాన్ని వేదికగా చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  

అయితే ఆ విస్తృత స్థాయి సమావేశంలో కూడా జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలలో చేసే ప్రసంగమే చేయడంతో దీని కోసం ఈ సమావేశం ఎందుకు అంటూ పార్టీ నేతలు ఉసూరుమన్నారు. ఎప్పడూ చెప్పే ఆవుకథకు తోడు ఈ సమావేశంలో జగన్ వచ్చే మార్చిలోనే ఎన్నికలు ఉంటాయనీ, అందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు.  ఈ నెల 25 నుంచీ డిసెంబర్ వరకూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను బస్సు యాత్రలతో చుట్టేయాలనీ, రోజుకు మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. అయితే ఈ సభలు వేటిలోనూ జగన్ పాల్గొనరు. అసలు తాను బటన్ నొక్కడం తప్ప ఇంకేమీ చేయనని పరోక్షంగా నేతలకు స్పష్టం చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారా అని పార్టీ వర్గాలే సెటైర్లు వేసుకుంటున్నాయంటే.. జగన్ ప్రసంగం వారిని ఎంత ప్రభావితం చేసిందో అర్ధమౌతుంది. ఎన్నికలు సన్నద్ధం కావాలనీ, తాను చేసిన సంక్షేమాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ చెప్పిన జగన్ చంద్రబాబు అరెస్టు విషయంలో తనపై వచ్చిన వ్యతిరేకత తీవ్రతతో ఎంత భయపడుతున్నారో కూడా పరోక్షంగా నేతలకు ఎరుకపరిచారు.  

దీంతో జగన్  ప్రసంగం నేతలలో ఉత్సాహం నింపడం అటుంచి,  వారిలో భయాన్ని ప్రోది చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో జగన్  కంగారు పడుతున్నారనీ, బాబు అరెస్టుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవడానికి తాపత్రేయపడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జనమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా జగన్ మాటలు నమ్మడం లేదని అంటున్నారు. చంద్రబాబు అరెస్టు గురించి తనకు ఏ మాత్రం తెలియదనీ, తాను లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆ అరెస్టు జరిగిందని జగన్  పార్టీ విస్తృత సమావేశంలో చెప్పి తనలోని భయాన్ని మరోసారి చాటుకున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత తన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్.. ఆ వెంటనే నిర్వహించిన సమీక్షల్లో చంద్రబాబు అరెస్టు గురించి గొప్పగా చాటారు. అరెస్టు చేసిన సీఐడీని అభినందించారు. ఎవరినీ వదలొద్దు.. అంటూ భుజం తట్టారు. దీంతో సీఐడీ చీఫ్ రెచ్చిపోయి తన స్కాన్ లో లోకేష్ సహా ఎవరెవరున్నారో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించేశారు. 

అయితే ఆ తరువాత చంద్రబాబు అరెస్టు వలన వ్యక్తిగతంగా తనకూ, ప్రభుత్వానికీ, పార్టీకీ జరిగిన డ్యామేజీ జగన్ కు అర్ధమైందనీ, అందుకే ఆ అరెస్టుతో తనకు సంబంధం లేదనీ, విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే వరకూ తనకా విషయమే తెలియదనీ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటం, రాజకీయాలకు అతీతంగా బాబుకు మద్దతు పెరుగుతుండటం, ఎంతగా నిర్బంధకాండను అమలు చేసినా, రాష్ట్రం మొత్తాన్ని ఆంక్షల వలయంలో నింపేసినా నిరసనలు ఆగకుండా కొనసాగుతుండటంతో జగన్  ఈ అరెస్టు వల్ల రాజకీయంగా జరిగిన నష్టం ఏమిటన్నది బోధపడింది. చంద్రబాబు అరెస్టు తరువాత వైసీపీ గ్రాఫ్ అధ:పాతాళానికి పడిపోయిందన్న సంగతి సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు నష్ట నివారణ కోసం జగన్ ఆ అరెస్టుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే  ఆయన చెప్పే మాటలు కనీసం పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మడం లేదు. ఇక జనమెలా నమ్ముతారని పరిశీలకులు అంటున్నారు.  

చంద్రబాబు అరెస్టు తరువాత పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్పన్నమైన ఓటమి భయాన్ని పక్కన పెట్టేందుకే మార్చిలోనే ఎన్నికలు.. సిద్ధం కండి అంటూ పిలుపు నిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ ఎన్నికల సన్నద్ధతకు తాను మాత్రం దూరం అంటూ ముక్తాయించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గతంలో కూడా గడపగడకకూ అంటే తమను జనం ముందు దోషులుగా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజాగ్రహానికి తమను బలి చేసి ఆయన మాత్రం ప్రగతి భవన్ లో భద్రంగా కూర్చుంటారా? అని అంతర్గత సంభాషణల్లో  పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే జనం వై ఏపీ నీడ్స్ జగన్ అని తమను ముఖం మీదే ప్రశ్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్ తాను మాత్రం ప్రజల ముందుకు రాను మీరు వెళ్లి వ్యతిరేకతను సానుకూలతగా మార్చండని ఆదేశించడమేమిటని ప్రశ్నించుకుంటున్నారు. 

By
en-us Political News

  
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.