అయ్యో జగనన్నా.. నీకెంత కష్టం వచ్చింది జగనన్నా...!

Publish Date:Aug 14, 2024

Advertisement

బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే విమానం బయల్దేరడానికి సిద్ధంగా వుంది. విమానంలోని ఎకానమీ క్లాస్ అప్పటికే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మొత్తం విమానంలో చివరి వరసలో రెండు సీట్లు మాత్రం ఖాళీగా వున్నాయి. ఇంతలో ఒక జంట విమానంలోకి ప్రవేశించింది. అతను పొట్టిగా వున్నాడు. ఆమె సన్నగా వుంది. అతని ముఖంలో ‘ఏంటో.. నా జీవితం ఇలా అయిపోయింది’ అనే ఎక్స్.ప్రెషన్. ఆమె ముఖంలో ‘అంతా నా ఖర్మ’ అనే ఎక్స్.ప్రెషన్. వాళ్ళిద్దరూ విమానం చివర్లో వున్న తమ సీట్ల వైపు నడుస్తున్నారు. వాళ్ళని చూసిన విమానంలోని ప్రయాణికులకు ‘వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే..’ అనే సందేహం కలిగింది. ప్రయాణికులలో కొంతమందికి వాళ్ళెవరో వెంటనే వెలిగింది. మరికొంతమందికి కొద్ది క్షణాల తర్వాత వెలిగింది. వాళ్ళెవరో కాదు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులు. అంతే, ఆ విషయం అర్థం కాగానే అందరూ షాకైపోయారు. ఆ జంట ప్రయాణికుల మధ్యలోంచి తమ సీట్లను వెతుక్కుంటూ వెళ్ళి, చివరి వరుసలో వున్న తమ సీట్లలో కూర్చున్నారు. అప్పటికే ఎలర్ట్ అయిపోయిన జనం జగన్ దంపతులను ఫొటోలు తీసుకుంటున్నారు. కొంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ హడావిడిని చూసి వైఎస్ భారతి ఇబ్బందికరంగా ముఖం పెట్టుకుంటే, జగన్ మాత్రం తనదైన ‘షిక్కటి షిరునవ్వుతో’ కూర్చున్నాడు.

జగన్‌ దంపతులను ఈ పరిస్థితుల్లో జగన్ భజన బ్యాచ్ చూస్తే వాళ్ళ మనసులు ఎలా ఘోషిస్తాయంటే.... ‘‘అయ్యో జగనన్నా.. నీకు ఎంత కష్టం వచ్చింది జగనన్నా.. అయ్యో వదినమ్మా.. నీకు ఎంత కష్టం వచ్చింది వదినమ్మా.. ప్రజల సొమ్ముతో ఎలాంటి విమానాల్లో తిరిగిన జంట మీది.. గంటకి పది లక్షల రూపాయల ఖర్చుతో ఎడాపెడా విమానాల్లో తిరిగిన మీరా.. ఇలా మామూలు విమానంలో చివరి సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తున్నది.. హయ్యో.. విధి ఎంత బలీయమైనది.. జనం సొమ్ముతో ఎప్పుడు విమానం ఎక్కినా మహారాజు, మహారాణిలా ప్రయాణం చేసేవారే... ఇప్పుడేంటి ఇలా విమానం వెనుక సీట్లలో వలస వెళ్తున్న వరద బాధితుల్లా ప్రయాణిస్తున్నారు.. విమానంలో ఈ  అవమానమేంటి జగనన్నా.. 2004 నుండి 2024 వరకు మీరు కొట్టేసిన  డబ్బుతో ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి  విమానాలు వెయ్యి కొనగలిగిన శక్తి వుండి కూడా... సైకిల్ టైర్ పంక్చర్‌ వేయించుకోవడానికి కూడా పైసలు లేవు అన్న ఫేసులతో  ఎకానమి క్లాస్‌తో ప్రయాణం చేస్తున్నారా... ఆరు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లు వాడిన జగనన్నేనా ఈయన.. అడుగు బయటపెడితే పరదాల వెనుకే వున్న జగనన్నేనా ఈయన.. అయ్యో.. ఇంకా భూకంపం రాలేదేంటి.. సముద్రాలు పొంగిపోలేదేంటి.. అగ్నిపర్వతాలు బద్దలవ్వలేదేంటి?’’

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.