పులివెందులలో ప్రజలకు కనిపించకుండా పరదాలు.. కోనసీమలో వరద కష్టాలను కప్పేయడానికి తెరలు!

Publish Date:Jul 24, 2022

Advertisement

ఏ నాయకుడైనా ప్రజలకు ఎప్పుడు ముఖం చాటేస్తాడు. ప్రజలలో తన పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిసినప్పుడు. అని వార్యంగా ప్రజల ముందుకు రావలసినప్పుడు అధికారంలో ఉన్న నాయకుడైతే తనను వ్యతిరేకించే వర్గాన్ని నిర్బంధించి.. తన అనుకూల వర్గాలను చుట్టూ పెట్టుకుని జేజేలు కొట్టించుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రెండు విధానాలనూ ఇప్పటికే ఉపయోగించేశారు. నెలల తరబడి ప్యాలెస్ దాటి జనంలోకి రాకుండా ఉండటమూ అయిపోయింది. పులివెందుల పర్యటనలో జనం ఆయనకు సమీపంలోకి రాకుండా బ్యారికేడ్లు పెట్టడమూ అయిపోయింది. ఇప్పుడాయన విపక్షాల విమర్శల కారణంగా అనివార్యంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వెళుతున్నారు. మంగళవారం (జులై 26)న ఆయన కోనసీమ జిల్లాలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ పక్కాగా ఖరారైపోయింది. ఆయన పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లూ చేసేస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు ఏర్పాట్లేమిటంటారా? ఉంటాయి. రాజుగారు ప్రజల అవస్థలను చూడలేరు. అందుకు అవేమీ ఆయనకు కనిపించకుండా తెరలు కట్టేయడమే ఏర్పాట్లన్న మాట. తెరల మాటున వరద నష్టాన్ని, బాధితుల ఇబ్బందుల్నీ కప్పేసిన తరువాత తీరికగా జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారన్న మాట. అంతా బ్రహ్మాండంగా ఉంది. మా ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ప్రకటనో, ప్రసంగమో, లేదా మీడియా సమావేశంలోనో చెప్పేసి తన భుజాలను తానే చరిచేసుకుని పర్యటన ముగిస్తారన్న మాట.

నాయకుడు బాధితులతో మమేకం అవ్వాలి. కష్టాల్లో ఆదుకుంటానన్న భరోసా ఇవ్వాలి. వరద ముంపులో ఉన్న సమయంలోనే వారి దగ్గరకు వెళ్లాలి. ముంపు బాధలను ప్రత్యక్షంగా చూడాలి. అందుకు భిన్నంగా వదర నీటిలో జనం నిండా మునిగి ఉన్న సమయంలో ఏరియల్ వ్యూ అంటూ గాలిలో తిరిగి వెళ్లిపోయిన జగన్.. అసందర్బంగా వివిధ శాఖల సమీక్షలు నిర్వహించారే తప్ప వరద బాధితుల కష్టాల గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు విపక్ష నేత వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి వరదలోనే ముంపు బాధితులకు కలిసి వారికి భరోసా ఇచ్చి వచ్చిన తరువాత అనివార్యంగా జగన్ పర్యటనకు బయలు దేరుతున్నారు.  

అది కూడా వరద తీసేసిన తరువాత. అది కూడా వదర ఛాయలు కూడా జగన్ కు కనిపించకుండా అధికారలు తెరలతో కప్పేసిన తరువాత. భారీ నష్టం జరగలేదని చెప్పడానికి ఏం చేయాలో అన్నీ అధికారులు చేసేసిన తరువాత.   వరద బాధితులు తమను ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే..  వరద బాధితులను తాము బ్రహ్మాండంగా ఆదుకున్నాం.. వారికి కష్టమనేది తెలియకుండా అన్ని చర్యలూ తీసుకున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో విపక్ష నేత పర్యటనపై విమర్శలు గుప్పించింది. అసలాయన ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారంటూ నిలదీసింది.

ఆయన పర్యటన వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందంటూ దుయ్యబట్టింది. వాస్తవంలో వరద బాధితులను గోదారికి వదిలేసిందన్న బాధితుల ఆగ్రహాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడేమో జగన్ కోనసీమలో పర్యటించి తెరల వెనుక ఉన్న కష్టాన్ని, నష్టాన్ని చూడకుండా తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేసిందనీ, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుందనీ చెప్పడానికి ఒక రోజు పర్యటనకు రాజు వెడలె రవితేజములలరగ అన్నట్లు పర్యటించేస్తారన్నమాట.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.