మళ్లీ పాదయాత్రా జగన్.. జనం పారిపోతారు జాగ్రత్త!

Publish Date:Nov 5, 2024

Advertisement

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సుదీర్ఘ పాద‌యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నారా..  వ‌చ్చే నాలుగేళ్లు పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లో ఉండేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా..?  అన్న ప్రశ్నలకు వైసీపీ వ‌ర్గాల నుంచి అవుననే స‌మాధానమే వినిపిస్తోంది.  2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌న‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నద‌ని, కాంగ్రెస్ తో కుమ్మ‌క్కై త‌న‌పై చంద్ర‌బాబే కేసులు పెట్టించారంటూ ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ క‌న్నీరు పెట్టుకున్నంత ప‌ని చేశారు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందారు. సాధార‌ణంగా ఏ రాజ‌కీయ నాయ‌కుడు పాద‌యాత్ర చేసినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తానని,   అండ‌గా ఉంటానని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తారు. కానీ, గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర కేవ‌లం ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు మాత్ర‌మే సాగింది. పాదయాత్రలో తనను కలిసిన వారి బుగ్గలపై ముద్దులు పెడుతూ, బుగ్గ‌లు నిమురుతూ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. అంతేకాక‌.. వైసీపీ అధికారంలోకి వ‌స్తే అద్భుత పాల‌న అందిస్తాన‌ని హామీలు గుప్పించారు. ఒక్క‌ చాన్స్ ఒకే ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ప్ర‌జ‌ల‌ను  వేడుకున్నారు. జ‌గ‌న్ మాయ‌మాట‌ల‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు ఆ ఒక్క చాన్స్ ఇచ్చారు.  2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప‌ట్టం క‌ట్టారు. 

వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంద‌ని భావించిన ప్ర‌జ‌ల‌కు సీఎం పీఠం అదిరోహించిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న విశ్వ‌రూపాన్ని చూపించారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్దిరోజుల‌కే ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని కూల్చేశారు. అక్క‌డి నుంచి రాష్ట్రంలో అరాచ‌క పాల‌నను జ‌గ‌న్ మెద‌లు పెట్టారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ప‌క్క‌న పెట్టేసి మూడు రాజ‌ధానులు అంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు.  విశాఖ కేంద్రంగా పాల‌న సాగిస్తాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జ‌గ‌న్ హ‌యాంలో వైసీపీ నేత‌లు రెచ్చిపోయారు. తెలుగుదేశం, జ‌న‌సేన  నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేశారు. మ‌రోవైపు.. ప‌లువురు టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టించి జైళ్ల‌కు పంపించారు. కొంద‌రు పోలీసులు వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రించారు. అలాగే  జగన్ అరాచ‌క పాల‌న‌ను ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం జైళ్ల‌కు పంపించ‌డం వైసీపీ ఐదేళ్ల పాల‌నలో నిత్య‌కృత్యంగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధి మ‌రిచి  కేవ‌లం దోపిడీ చేయడానికే అధికారంలోకి వ‌చ్చామ‌న్న‌ట్లుగా జగన్ ఆయన పార్టీ నేతలు వ్యవహరించారు. 

అధికారం కోసం పాదయాత్ర చేసి, ప్రజలకు ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. తాడేపల్లి ప్యాలెస్ విడిచి బయటకు వచ్చిన ప్రతిసారీ దారి పోవవునా పరదాలు కట్టుకుని తిరిగారు. జనం సమస్యలు పట్టించుకోవడం, పరిష్కరించడం మాట అటుంచి సమస్యలు వినడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. నిలదీసిన వారిపై దాడులు, దౌర్జన్యాలతో వైసీపీయులు రెచ్చిపోయారు. జగన్ పాలనలో సమాజంలోని ఏ వర్గం సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితి నెలకొంది. ఇదేళ్ల పాటు పంటి బిగువున జగన్ అరాచక, దుర్మార్గ పాలనను భరించిన జనం 2024 ఎన్నికలలో గ‌ట్టి షాకిచ్చారు. కసిగా ఓటేసి జగన్ పార్టీని ఘోరంగా ఓడించారు.  క‌నీసం ప్ర‌తిప‌క్ష  హోదానుకూడా వైసీపీకి ఇవ్వ‌లేదు.   

ఇప్పుడు తెలుగుదేశం కూటమి  అధికారంలో ఉంది. దీంతో జగన్ లో భ‌యం మొద‌లైంది. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం వ‌రుస‌గా కేసులు న‌మోదు చేస్తున్నది. తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసులో ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లను పోలీసులు అరెస్టుచేయ‌గా.. మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, నారా లోకేశ్ పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్యలు చేసిన వారిపైనా కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. మరో వైపు ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి క్రూరమైన మైండ్ సెంట్ లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరగా.. మరికొందరు వైసీపీ నేతలు రాజీనామాలు చేసి కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా మంది నేతలు కూడా పార్టీకి రాంరాం చెప్పేందుకు రెడీగా ఉన్నారన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. మరోవైపు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మతో ఆస్తి విబేధాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. దీనికితోడు జగన్ పై పాతకేసుల్లో బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో అవినీతిపై జగన్ పై కేసులు నమోదు అయ్యే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి.  

దీంతో జగన్ ను జైలు భయం వెంటాడుతోంది.  తన అరెస్టుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసే నాటికి పాదయాత్ర పేరుతో  ప్రజల మధ్య ఉండాలని జగన్ భావిస్తున్నారన్న  వైసీపీ వర్గాల్లో చర్చజరుగుతున్నది. పాదయాత్రలో ఉండగా అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందని, తద్వారా వచ్చే ఎన్నికల నాటికి కాస్తో కూస్తో మేలు జరుగుతుందని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పాదయాత్ర ప్రారంభించి.. వీలున్నప్పుడల్లా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లొచ్చని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి మళ్లీ ప్రజల్లో సానుభూతి పొందేందుకు జగన్ పాదయాత్రను ఎంచుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే, గతంలోలా ప్రజలు జగన్ ను ఆహ్వానించే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను రుచి చూసిన ప్రజలు.. ఈ సారి పాదయాత్ర అంటూ తమ వద్దకు వస్తే ఆహ్వానించడం సంగతి అటుంచి అంటేనే ప్రజలు ఆమడదూరం పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.