Publish Date:Dec 28, 2022
తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి వైవీ సుబ్బారెడ్డిని సాగనంపేందుకు వైకుంఠ ఏకదశి సాక్షిగా ముహుర్తం ఖరారు అయినట్లు వైసీపీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది. కొత్త సంవత్సరం.. ఆ మరునాడే వైకుంఠ ఏకదశి రావడం.. దీంతో తిరుమల కొండపై భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో కొండపై భక్తుల హడావుడి తగ్గగానే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవికీ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సుబ్బారెడ్డి స్థానంలో పల్నాడు జిల్లాకు చెందిన ఓ బీసీ నేతకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారనీ, మఘమాసంలో..ఓ మంచి ముహూర్తంలో ఆయన పేరును ప్రకటిస్తారని వారు చెబుతున్నారు.
వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గానే కాక వైసీపీ ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని... దాంతో వైవీ సుబ్బారెడ్డి.. ఉత్తరాంధ్రలో పాగా వేసి.. పార్టీ విజయం కోసం సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో కృషి చేయడం కోసమే ఆయనను టీటీడీ పదవి నుంచి జగన్ తప్పించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకోవైపు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ అయిందని.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో నిర్వహించిన ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సైతం సూపర్ సక్సెస్ అయిందని.. ఈ రెండు చోట్ల చంద్రబాబు సారథ్యంలో జరిగిన సభలకు భారీగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని.. అలాంటి వేళ అధికారంలో ఉన్న వైసీపీ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉందని.... అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్... బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించి.. ఉత్తరాంధ్ర వ్యవహారాలకే పరిమితం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అదీకాక గతంలో ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బాధ్యతలు విజయసాయిరెడ్డి పర్యవేక్షించేవారు. .. కానీ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు కట్టబెట్టిన జగన్ ఇప్పుడు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి బీసీ నాయకుడికి ఇవ్వాలని నిర్ణయించారు. దీని వల్ల బీసీ వర్గాలలో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవ్వడానికి అవకాశాలున్నాయని జగన్ భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-to-change-yv-subbareddy-from-ttd-chairman-post-39-149148.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?