జై  జ‌గ‌దీప్‌..  జ‌గ‌న్ 

Publish Date:Jul 17, 2022

Advertisement

ఎవ‌ర‌న్నా అవ‌స‌రంలో వున్న‌పుడు మ‌ద్ద‌తుకోసం అడుగుతారు. మ‌న‌కు వీలున్నంత‌వ‌ర‌కూ ఇబ్బంది లేద‌నిపిస్తే ఓకే అంటాం. ప్ర‌స్తుత రాజకీయ‌ప‌రిస్థితుల్లో బిజెపి, వైసీపీ స్నేహం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీఎం జ‌గ‌న్‌కు చాలా అవ‌స‌రం గ‌నుక ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి త‌మ అభ్య‌ర్ధిగా బిజెపి జ‌గ‌దీప్ దిన‌క‌ర్‌ను ప్ర‌క‌టించ‌గానే ఇక్క‌డ‌నుంచి జ‌గ‌న్ ఓకే అని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేశారు. అంతేకాదు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి జ‌గ‌దీప్‌గారికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆదివారం ఏకంగా హిందీలో ట్వీట్  చేయ‌డ‌మూ అయిపో యింది. రైతు బిడ్డ జగదీప్‌ ధనకర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించినందుకు తనకు చాలా సంతోషం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. జగదీప్ ధన్‌కర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతు తెలిపింది వైఎ స్సార్సీపీ.

వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ కే జైకొట్టింది. రాష్ట్రపతి ఎన్నిక‌ ల్లోనూ బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ  ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. అయితే అంద‌రికంటే ముందుగానే జ‌గ‌న్ మ‌ద్ద‌తు తెలియ‌జేయ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వాస్త వానికి జ‌గ‌న్ పార్టీ త‌ర‌ఫున ఇంకా ఓకే అన‌క‌పోయినా, విజ‌య‌సాయి రెడ్డి మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న పార్టీప‌రంగా చెప్పిన‌ట్టేన‌ని విశ్లేష కులు అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. రాజ్యసభలో వైసీపీకి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అధికారిక ప్రకటనగానే భావించవచ్చు.

ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు విషయంలో కొంత వివాదం జరిగిన విషయం తెలిసిందే. మేం అడగకుండానే వైసీపీ మద్దతు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి వై.స‌త్య‌కుమార్‌ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై విరుచు కుపడిన వైసీపీ నేతలు  బీజేపీ హైకమాండ్ కోరితేనే తాము మద్దతు తెలిపినట్లు ఎదరుదాడికి దిగారు. ఆ తర్వాత ఈ అంశంపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కూడా స్పందించారు. ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైసీపీని కోరామని స్ప‌ష్టంచేశారు. సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐతే ఇప్పుడు మాత్రం అడగకుండానే జగదీప్‌ ధన్‌కర్‌కి వైసీపీ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక, తెలంగాణ అధికార ప‌క్షం టిఆర్ ఎస్ విష‌యానికి వ‌స్తే,  నరేంద్ర మోదీయే టార్గెట్‌గా కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు కాకుండా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తునిచ్చారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటార న్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా విపక్షాల అభ్యర్థికే మద్దతు తెలుపుతారా? లేదంటే బీజేపీ రైతు బిడ్డగా చెబుతున్న జగదీప్‌కు జైకొడతారా? అన్నది తెలియాల్సి ఉంది.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.