తెలుగువన్ ముందే చెప్పింది.. జగన్ అడుగు కాంగ్రెస్ వైపే పడింది!

Publish Date:Jul 24, 2024

Advertisement

వైసీపీ వ్యూహం మార్చింది. ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు దగ్గరౌతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాల ఊసే లేకుండా గడిపేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోగానే బీజేపీకి దూరం జరిగి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు దగ్గర అవ్వడానికి అడుగులు వేస్తున్నది.  కాంగ్రెస్‌తో దోస్తీ.. మారిన జ‌గ‌న్ వ్యూహం !? శీర్షికన జగన్ అడుగులు ఏ దిశగా పడనున్నాయన్న విషయాన్ని తెలుగువన్ మూడు రోజుల ముందే చెప్పింది.  ఏపీలో చంద్రబాబు సర్కార్ ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత 

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి   కాంగ్రెస్ కు దగ్గరౌతున్నారని విస్పష్టంగా చెప్పింది. ఇందుకు కాంగ్రెస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా  వైసీపీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో కాంగ్రెస్ వాదనకు మద్దతు పలకడం ద్వారా తన అడుగులు ఎటుపడుతున్నాయన్నది చెప్పకనే చెప్పేసింది.    జగన్ కాంగ్రెస్ కు మద్దతుగా  నిలిస్తే అందుకు ప్రతిగా జాతీయ‌ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ మోహ‌న్ను హైలేట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు అంగీకరించారనీ, ఈ మేరకు వైసీపీ, కాంగ్రెస్ ల మధ్య డీల్ కుదిరిందని  ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తరువాత, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆ రెండు సందర్భాలలోనూ ఆయన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే జగన్ తన ప్రతిపాదనలను ఆయన ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.  కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయంగా వైసీపీ  మ‌ద్ద‌తు, ఫండింగ్ ఉంటుందని జగన్ చెప్పారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అప్పట్లో జగన్ తో  తన భేటీ వార్తలను డీకే శివకుమార్ ఖండించారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే.. జగన్, కాంగ్రెస్ ల మధ్య ఏదో స్థాయిలో సఖ్యత ఏర్పడిందని స్పష్టమౌతోంది. 

వైసీపీ గత పదేళ్లుగా ఎన్డీయే కూట‌మికి మ‌ద్ద‌తుగా ఉంటూ వ‌చ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులేనని తెలిసిందే.  ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసులు జగన్ మెడపై కత్తిగా వేలాడుతున్నప్పటికీ   కాంగ్రెస్ కు వైసీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. ఇందుకు  కారణం లేకపోలేదు. కాంగ్రెస్ కు లోక్ సభలో మద్దతుగా నిలిచినా.. రాజ్యసభలో వైసీపీకి ఉన్న 11 మంది ఎంపీల మద్దతు కోసం మోడీ సర్కార్ తన జోలికి రాదని జగన్ ధీమాగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ విషయంలో వైసీపీ బాహాటంగా కాంగ్రెస్ వాదనకు మద్దతు ప్రకటించింది.  లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి కేటాయించాలంటూ గళమెత్తింది.   ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.  డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంటోందని, దీన్ని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమికి దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.