బెంగ‌ళూరులోనే జగన్ మకాం.. శ‌వం ఉంటేనే ఆంధ్రాకు!

Publish Date:Jul 28, 2024

Advertisement

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాన‌సిక స్థితి స‌రిగా లేన‌ట్లు క‌నిపిస్తోంది. హ‌త్య‌లు, దాడుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని భావించిన ఆయ‌న‌కు ఎన్నిక‌ల్లో గ‌ట్టి షాక్ త‌గిలింది. ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని నిర్ద్వంద్వంగా తేల్చేశారు. అధికారంలో ఉన్న‌ప్పుడే జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితిపై కొంద‌రు వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఘోర‌ ఓట‌మి త‌రువాత ఆయ‌న ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థంకావ‌డం లేద‌ని ఆ పార్టీ నేత‌లు తలలుబాదుకుంటున్నారు. నూత‌నంగా అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం  ప్ర‌భుత్వానికి పాల‌నాప‌రంగా స‌ర్దుబాటు కావ‌టానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. దీంతో ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏ పార్టీ అయినా క‌నీసం ఓ ఆర్నెళ్లు త‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను ముమ్మ‌రం చేసేందుకు స‌మ‌యం తీసుకుంటుంది. త‌ద్వారా ఆ స‌మ‌యంలో అధికార పార్టీ వ్య‌వ‌హార‌శైలిని బ‌ట్టి రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు వ్యూహాల‌కు ప‌దునుపెడుతుంటారు. కానీ, జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి సంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు భిన్నంగా ఉంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌ని, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేస్తున్నారంటూ జ‌గ‌న్ గ‌గ్గోలు పెడుతున్నారు. ఓ ప‌క్క రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంతో ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటే.. జ‌గ‌న్, కొంద‌రు వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

అధికారం కోల్పోయిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని భ‌యం వెంటాడుతోంది. ఐదేళ్ల కాలంలో తానుచేసిన అరాచ‌క పాల‌న‌ను గుర్తుచేసుకుంటున్న జ‌గ‌న్‌.. కూట‌మి ప్ర‌భుత్వంకూడా అదే ప‌ద్ద‌తిని పాటిస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు‌. కానీ, సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధే ల‌క్ష్యంగా పాల‌న‌పై దృష్టిపెట్టారు. రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉంటే పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకొస్తార‌ని, త‌ద్వారా ఉపాధి అవ‌కాశాలు పెరిగి, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉండ‌టంతో కేంద్రం నుంచి వీలైన‌న్ని ఎక్కువ‌ నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా చంద్ర‌బాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రాష్ట్రంలో అభివృద్ధిని చూసి త‌ట్టుకోలేపోతున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్ లో ఉండ‌లేక పోతున్నారు‌. దీంతో చీటికిమాటికి బెంగ‌ళూరులోని ఆయ‌న ప్యాలెస్‌కు వెళ్తున్నాడు. 

అధికారం కోల్పోయిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే రెండు సార్లు బెంగ‌ళూరులోని ఆయ‌న ప్యాలెస్‌కు వెళ్లారు. కొద్దిరోజులు అక్క‌డే ఉన్నారు. ఇటీవ‌ల రాష్ట్రానికి వ‌చ్చిన ఆయ‌న‌.. శ‌వ రాజ‌కీయం పూర్త‌యిన త‌రువాత‌.. మ‌ళ్లీ స‌తీస‌మేతంగా బెంగ‌ళూరు వెళ్లారు. బెంగ‌ళూరులో జ‌గ‌న్ వెళ్లేది ఆయ‌న‌ సొంత ఇంటికే అయినా.. అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారి కూడా అక్కడకు వెళ్ల‌ని జ‌గ‌న్‌ ఇప్పుడు చిటికీ మాటికీ బెంగళూరు వెళ్ల‌డానికి కార‌ణం ఏమిట‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వర్గాల్లో జ‌రుగుతోంది. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. ప్ర‌జ‌లు ఘోరంగా ఓడించ‌టాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు..   చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన 50రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరుకులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వంలో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ ప్యాలెస్ కూడా అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోనే ఉంది. ప్ర‌స్తుతం ఆ ప్రాంతం నిత్యం ర‌ద్దీగా మారింది. తనకు నచ్చని అమరావతి రాజధాని పనులు తన కళ్లముందే వేగంగా జరుగుతుండటంతో జగన్ ఓర్వలేకపోతున్నారు. అందుకే అక్కడ ఉండలేకపోతున్నారని   వైసీపీ నేతలే చెబుతున్నారు. ఈ కారణంగా జగన్ బెంగళూరులో  ప్యాలెస్ లోనే మకాం వేస్తున్నారు.   బెంగళూరు నుంచే రాష్ట్రంలో ఘర్షణలకు జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలుగుదేశం కూటమి పార్టీల్లోని నేతలు ఆరోపిస్తున్నారు. తద్వారా శవ రాజకీయాలతో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని దేశ ప్రజలను నమ్మించేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ప్రతినిధులు ఏపీ వైపు చూడకుండా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.   

జగన్ కు తాడేపల్లితోపాటు హైదరాబాద్ లోనూ ఓ ప్యాలస్ లాంటి నివాసం ఉంది. గతంలో ఎక్కువగా జగన్ హైదరాబాద్ లోనే నివాసం ఉండేవారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదు. ఎందుకంటే.. తెలంగాణ   ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటమే కారణం. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు శిష్యుడిగా జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భంగాల్లో రేవంత్ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం గ‌త ఐదేళ్ల జగన్ పాలనలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో ఎప్పుడైనా త‌న‌ను అరెస్టు చేయొచ్చ‌ని కూడా జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు‌. ఏపీలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా తనకు ఇబ్బంది ఉంటుందని భావిస్తున్న జగన్.. బెంగళూరులో ఉండటమే సేఫ్ గా భావిస్తున్నారు. బెంగళూరులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే, అక్కడి డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉన్నారు. డీకేతో వైఎస్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా జగన్ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీకి కేవలం శవ రాజకీయాలు చేయడానికే మాత్రమే జగన్ వస్తారన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.