కూటమి ఐక్యతను బద్ధలు కోసం జగన్ స్కెచ్ అదేనా?
Publish Date:Jan 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ తో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగుతున్నది. క్షేత్ర స్థాయిలో ఏమైనా పొరపొచ్చాలు ఉన్నా వాటిని వెంటనే సరి చేసుకుని సమష్టిగా పని చేస్తున్నది. ఇదే విషయాన్ని ఇటీవల మంత్రి నారా లోకేష్ విస్పష్టంగా చెప్పారు. కూటమికి విడాకుల్లేవని పేర్కొన్నారు. ఇక జనసేనాని అయితే లోకేష్ కంటే ముందే దశాబ్దంన్నర పాటు కలిసే ఉంటాం. ఉంటున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వీటన్నిటినీ బేరీజు వేసిన తరువాతే.. వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఎన్ని పాదయాత్రలు చేసినా నీ పప్పులు ఉడకవ్ జగన్! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి సైతం కూటమి ఐక్యంగా ఉన్నంత వరకూ జగన్ అధికారంలోకి రావడం కల్ల అన్నారు. ఇలాంటి సిట్యువేషన్ ని కూడా ఢీ కొట్టి, డీకోడ్ చేయడం అన్నది జగన్ కత్తిమీద సామే అంటున్నారు పరిశీలకులు. గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్ కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వేసిన స్కెచ్ పని చేసింది. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా అనే అస్త్రం ప్రయోగించారు. దీంతో ఎన్డీఏలోంచి టీడీపీ బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చేసింది కూడా. కూటమి ఐక్యత దెబ్బతినడం వల్లనే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు అందుకోగలిగారు. 2024 ఎన్నికలలో కూటమి ఐక్యత కూడా జగన్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు జగన్ కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి జనసేన టార్గెట్ గా స్కెచ్ వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. జనసేనను తెలుగుదేశం నుంచి దూరం చేయడం అన్న లక్ష్యం పెట్టుకున్న జగన్ అందుకు అనుగుణంగా స్కెచ్ వేశారని అంటున్నారు. ఒక స్థానిక జర్నలిస్టు రైల్వేకోడూరు ఎమ్మెల్యే వర్సెస్ మహిళ వ్యవహారంలో చిన్న వార్త రాస్తే అతడ్ని బండ బూతులు తిడుతూ.. ప్రశ్నించిన ఆ మహిళ నోటి నుంచి పదే పదే వచ్చిన మాట శివారెడ్డి. అంటే ఇక్కడ వైసీపీ నేతల పాత్ర ఉందన్న మాట. ఆపై టీడీపీ ఇన్ చా ర్జ్ ముక్కా రూపానందరెడ్డిని కూడా బయటకు లాగుతూ వీడియోలు విడుదల చేసిందా మహిళ. అంటే ఇక్కడే అసలు మేటర్ అర్ధం అయిపోవడం లేదా? అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ఎమ్మెల్యే తల్లి చెప్పే మాటలను అనుసరించి చెబితే.. అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అయిన నెల రోజుల నుంచే ఆ మహిళ ఆయన వెంటపడిందట ఒకే కులం కాబట్టి పెళ్లి చేసుకోమని వెంట పడేదట. అంటే తొలి నాటి నుంచీ అరవ శ్రీధర్ వారి వ్యూహంలో చిక్కాడని భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మహిళ తర్వాతి కాలంలో అంచెలంచెలుగా శ్రీధర్ కి బాగా దగ్గరవుతూ వచ్చి.. ఇప్పుడు ముప్పై కోట్లు ఇవ్వకుంటే.. బండారం మొత్తం బయట పెడతా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నదని, వరుసగా ఒక్కో వీడియో విడుదల చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ బెదరింపులకు దిగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడే వైసీపీ రంగ ప్రవేశం చేసి.. ఆడపిల్లలకు ఎవరైనా ద్రోహం చేస్తే తల తీసేస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? అంటూ తన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్షర్ల ద్వారా నానా యాగీ చేస్తున్నది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ పాత్ర సుస్పష్టంగా తెలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి ప్రచారం ద్వారా జనసేన పట్ల ప్రజలలో వ్యతిరేకత వచ్చేలా చేసి.. టీడీపీని జనసేనకు దూరం చేయాలన్నదే జగన్ స్కెచ్ అంటున్నారు. తద్వారా 2029 ఎన్నికల నాటికి కూటమి ఐక్యత విచ్ఛిన్నమయ్యేలా చేయాలన్నదే వైసీపీ టార్గెట్ అంటున్నారు. అందుకే జనసేనాని ఇప్పటికే తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు బీవేర్ ఆఫ్ వైసీపీ అంటూ ఓ హెచ్చరిక జారీ చేశారు. అయితే అరవ శ్రీధర్ లాంటి కొందరు బలహీనులు ఇలాంటి హనీ ట్రాప్ లో చిక్కి.. ఇదిగో ఇలా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారన్న పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/jagan-sketch-to-break-allience-25-213159.html





