వినుకొండ రషీద్ కుటుంబానికి జగన్ షాక్!
Publish Date:Jul 29, 2024
Advertisement
జగన్‌ని నమ్మితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టే.. షాక్ కొట్టాక గానీ జగన్‌ని నమ్మడం ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తాము చేసిన తప్పు తెలిసొచ్చింది. అందుకే, ఆ తప్పు మరోసారి చేయకుండా తమను తాము రక్షించుకున్నారు. కానీ, పాపం ఇంకా కొంతమందికి జగన్ అసలు స్వరూపం అర్థం కాలేదు. అందుకే గొర్రె కసాయివాడిని నమ్మినట్టు జగన్‌ని నమ్ముతున్నారు. నమ్మడం మీ వంతు, మిమ్మల్ని మోసం చేయడం నావంతు అన్నట్టుగా జగన్ తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్.గా జగన్ చేతిలో దారుణంగా మోసపోయింది ఎవరయ్యా అంటే, వినుకొండలో హత్యకి గురైన రషీద్ కుటుంబ సభ్యులు. హతుడు రషీద్, హంతకుడు జిలానీ ఇద్దరూ పాత స్నేహితులే. ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే. అయితే కారణాలు తెలియవుగానీ, ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. అది రషీద్ హత్యకి దారి తీసింది. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్య అని పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. రషీద్‌కి, జిలానీకి వ్యక్తగత కక్షలు ఎప్పటి నుంచో వున్నాయని రషీద్ కుటుంబానికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో రషీద్ హత్యకు గురికావడంతో శవాల కోసం వెతికే రాబందు జగన్మోహన్‌రెడ్డికి మంచి అవకాశం దొరికింది. రషీద్ కుటుంబాన్ని పరామర్శించే పేరుతో వినుకొండకి వెళ్ళి నానా రచ్చ చేయడానికి ఛాన్సొచ్చింది. జగన్ నాటకం మరింత రక్తి కట్టడానికి కావలసింది రషీద్ కుటుంబ సభ్యుల మద్దతు. అంతే, జగన్ ఆదేశాలతో లోకల్ వైసీపీ బ్యాచ్ రషీద్ కుటుంబం దగ్గరకి వెళ్ళింది. జగన్ సార్ పరామర్శకి వస్తారు. మీరు ఆ సమయంలో ఇది రాజకీయ హత్యేనని చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పాలి. పనిలోపనిగా తెలుగుదేశం పరిపాలన సరిగా లేదని కూడా చెప్పాలి. జగనన్న పరామర్శకు వచ్చి వెళ్ళిన తర్వాత పది లక్షల రూపాయలు మీకు అందుతాయి. చెట్టంత రషీద్‌ని పోగొట్టుకున్న బాధలో వున్న మీకు ఆ డబ్బు వస్తే కొంత ఊరట దక్కుతుంది అని చెప్పి ఒప్పించారు. ఆ తర్వాత జగన్ వినుకొండకి రావడం, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం, రషీద్ కుటుంబం తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పడం, మధ్యమధ్యలో చంద్రబాబు పథకాలు ఏవీ అందడం లేదని కూడా చెప్పడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాతే స్టోరీలో జగన్ మార్కు అసలు ట్విస్టు మొదలైంది. జగన్ రావడం అయింది, వెళ్ళడం అయింది. రషీద్ కుటుంబానికి ఇస్తానన్న ఆర్థిక సాయం మాత్రం అందలేదు. రేపో ఎల్లుండో జగన్ సార్ డబ్బు పంపుతారు అని ఎదురుచూసిన రషీద్ కుటుంబానికి మెల్లగా జ్ఞానోదయం కలిగింది. ఈ విషయంలో స్థానిక నాయకులను అడిగితే, వాళ్ళు ‘‘మాకేం తెలుసు.. ఆయన పదిలక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తారని అనుకున్నాం.. కానీ అలా జరగలేదు’’ అని చేతులెత్తేశారు. దాంతో రషీద్ కుటుంబం షాకైపోయారు. అప్పటికి గానీ వాళ్ళకి జగన్ అసలు స్వరూపం అర్థం కాలేదు. పాపం.. కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయారు.. జగన్ దిక్కుమాలిన రాజకీయాల్లో పావులా మారారు.
http://www.teluguone.com/news/content/jagan-shock-to-rasheed-family-39-181723.html





