Publish Date:Nov 25, 2024
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించారు. జగన్, బీజేపీల రహస్య మైత్రి అప్పట్లో ప్రతి సందర్భంలోనూ వెలుగులోకి వచ్చింది. జగన్ అరాచకాలను, అస్తవ్యస్త విధానాలనూ అప్పట్లో బీజేపీ అన్ని విధాలుగా సమర్ధించింది. సహకరించింది. ప్రోత్సహించింది. సరే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ అధినాయకత్వం తన వైఖరి మార్చుకుని జగన్ తో దూరం పాటిస్తోందని ఇంత కాలం, అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అందరూ భావించారు.
అందుకు తగ్గట్టుగానే ఏపీలో బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ అరెస్టునకు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో జగన్ కూడా బీజేపీపై, కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కాంగ్రెస్ కూటమికి చేరువ అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇతంతా ఉత్తిదేననీ, జగన్, బీజేపీల మధ్య మైత్రి దృఢంగా కొనసాగుతోందనీ తాజాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. తాజాగా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చేసిన దిశానిర్దేశాన్ని చూపుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ మద్దతు ఇవ్వాలని ఎంపీలకు సూచించారని ఆ పార్టీ నేతలే చెప్పడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.
సోమవారం (నవంబర్ 25) నుంచి వచ్చే నెల 20 వరకూ జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు మరీ ముఖ్యంగా బీజేపీకి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అద్భుత విజయం ఆ పార్టీకి ఇచ్చిన ఉత్సాహంతో మోడీ, షాలు అజెండాలో లేకున్నా ఈ సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిన్లును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఈ బిల్లే కాకుండా విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ఆమోదింప చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ ఆమోదం తెలపాలని జగన్ తన ఎంపీలకు సూచించారంటే.. బీజేపీతో ఆయన రహస్య మైత్రీ ఇంకా కొనసాగుతోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని చెబుతున్నారు.
లోక్ సభలో వైసీపీ మద్దతు, వ్యతిరేకతతో బీజేపీకి పెద్ద పట్టింపు ఉండదు కానీ, రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నిలిస్తే ఆ పార్టీని ఒకింత ఇరుకున పెట్టే అవకాశం వైసీపీకి ఉంటుంది. అయితే ఆ మాత్రంగా కూడా బీజేపీకి ఇబ్బంది కలిగించేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖంగా లేరు. అలా వ్యతిరేకిస్తే అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుని జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురౌతుందని జగన్ ఇప్పటికీ భయపడుతున్నారు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ఆయన ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారు. బీజేపీని తాను వ్యతిరేకించకుంటే.. తనపై కేసుల విషయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం సహకారం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి బీజేపీ ఏం చేస్తుందో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-secret-friendship-still-continue-25-188916.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.