దసరా గిఫ్ట్ గా ఎమ్మెల్యేలకు జగన్ సీల్డ్ కవర్లు.. విషయమేమిటంటే..?

Publish Date:Oct 18, 2023

Advertisement

ఏపీలో అధికార పార్టీలో ఇప్పుడు జగన్ దసరా గిఫ్టుల సంచలనం రేపుతున్నాయి. ఔను ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి దసరా గిఫ్టులు పంపించారన్న ప్రజారం జోరుగా సాగుతోంది. అయితే అవేం ఆషామాషీ గిఫ్లులు కాదని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ కొందరు ఎమ్మెల్యేలకు పింపించిన ఈ దసరా గిఫ్టులు వారి వారి నియోజకవర్గాలలో వారి పనితీరు, వారి విజయావకాశాలు తదితర అంశాలకు సంబంధించిన జగన్ సొంతంగా చేయించిన సర్వే రిపోర్టుల సీల్డ్ కవర్ లు అంటున్నారు .

అయితే ఈ సీల్డ్ కవర్ లు ఏయే ఎమ్మెల్యేలకు పంపించారన్న సమాచారం లేకపోయినా.. చాలా మంది సిట్టింగులకు ఇవి అందాయని అంటున్నారు.  దీంతో ఈ సీల్డ్ కవర్లు ఎవరెవరికి అందాయి, అందులో వివరాలేంటి అన్న వివరాలు తెలియక మొత్తం ఎమ్మెల్యేలంతా తెగ టెన్షన్ పడిపోతున్నారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అక్టోబర్ నెలలో అందిన తాజా సర్వే ఫలితాలను సీల్డ్ కవర్ లో  అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరన్న వివరాలు కూడా గోప్యంగానే ఉన్నాయి.  దీంతో ఆ రిపోర్టులలో ఏముంది?..  ఈసారి  పార్టీ టికెట్ గ్యారంటీ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అలాగే టికెట్ దక్కకుండా పోయే వారు ఎవరు? ఒక వేళ టికెట్ ఇచ్చినా.. తమ సిట్టింగ్ స్థానాలలోనే ఇస్తారా.. లేక నియోజకవర్గం షిఫ్ట్ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఉంటుందా? లేదా ఎమ్మెల్యేగా మీ సేవలు చాలు..ఇక లోక్ సభకు పోటీ చేయండి అంటారా? అసలు ఎవరెవరికి ఈ రిపోర్టులను దసరా గిఫ్టుగా జగన్ పంపించారు అన్న ఉత్కంఠ వైసీపీ ఎమ్మెల్యేలలో  వ్యక్తమౌతోందంటున్నారు.  

ఏపీలో మరో ఐదారు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆరు నెలల లోపు అంటే ఇక సమయం లేదు మిత్రమా రణమే అన్నట్లుగా  పరిస్థితి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే జగన్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆరంభించేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  కోఆర్డినేటర్ల ద్వారా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే పని ఆరంభమైపోయిందంటున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా అసంతృప్తులను బుజ్జగిస్తూ కలిసి పనిచేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే, పలు నియోజకవర్గాలలో అసంతృప్తులు రెబల్స్ గా మారుతుండడం పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారుతుంది. మరోవైపు  వైసీపీ సొంత సర్వే ఫలితాలు జగన్ చేతికి చేరడంతో..ఆ సర్వే ఫలితాల ఆధారంగానే  అభ్యర్థుల ఎంపికకు చేస్తున్న కసరత్తులో భాగంగానే జగన్ కొందరు ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాలలో సర్వే ఫలితానికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్ లో పంపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అంతే కాదు సర్వేల ఫలితాల ఆధారంగా పంపిన సీల్డ్ కవర్ లో ఆయా నియోజకవర్గాలలో  పార్టీ పరిస్థితి, సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు, గెలుపు అవకాశాల వివరాలతో పాటు 25 అంశాలతో కూడిన లేఖలను సీఎం పంపించారని చెబుతున్నాయి. అయితే ఇప్పటికింకా ఆ లేఖలు ఎవరికీ చేరలేదనీ, ఒకటి రెండు రోజులలో అవి అందుతాయనీ పార్టీ వర్గాల సమాచారం.  దీంతో   తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా తీసిన సర్వేల ఫలితాలు ఈ లేఖలో ఉండనుండగా.. పనితీరు బాగోలేని వారి పట్ల జగన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ప్రజా మద్దతు లేని ఎమ్మెల్యేలకు ఈసారి సీటు ఇవ్వడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి సీటు ఉంటుందా ఉండదా అన్నది లేఖ వస్తే కాని అర్ధమయ్యే పరిస్థితి లేకపోవడంతో సిట్టింగుల్లో కలవరం మొదలైంది.  పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు మెరుగ్గా పనిచేయాలని, లేకపోతే కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తామని గతంలోనేజగన్ సంకేతాలు  పంపారు. గతంలో తాడేపల్లిలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భం ఆ ఎమ్మెల్యేలకే ఇప్పుడు మళ్ళీ లేఖలు పంపి ఉంటారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

ఇప్పటికే రెండు విడతలుగా వైసీపీ సొంత సర్వేల ఫలితాలు వెలువడగా.. తాజాగా మూడవ విడత  ఫలితాలు కూడా అందాయి. గతంలో అందిన రెండు ఫలితాల ఆధారంగా జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించి పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరించగా.. ఇప్పుడు ఈ ఫైనల్ సర్వే ఫలితాల తర్వాత మాత్రం ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు లేఖలు పంపిన జగన్ అందులోనే పూర్తి వివరాలను పొందుపరిచారంటున్నారు. దాదాపుగా 25 నుండి 30 మందికి ఈసారి టికెట్లు కష్టమేనని.. ఇప్పటికే కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ కూడా మొదలైనట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీలో ఇప్పుడు ఈ లేఖల కలకలం రేగుతుంది. కాగా, ఎమ్మెల్యేల పనితీరుపై లేఖలు సరే.. అసలు వైసీపీ తాజా ఫైనల్ సర్వేలో రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు అందాయన్నది రాజకీయ వర్గాలకు ఆసక్తిగా మారింది. కాగా పరిశీలకులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ సిట్టింగులకు టికెట్ నిరాకరించి కొత్త అసంతృప్తిని ఆహ్వానించే పరిస్థితిలో లేరనీ, పని తీరు, ప్రజా మద్దతుతో పని లేకుండానే సిట్టింగులను బుజ్జగించి పనితీరు మెరుగుపరుచుకోమని బతిమలాడుకోవడమే ఆ లేఖల సారాంశం అయి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేక సెగ తగిలిన ఎమ్మెల్యేలూ, నేతలలో గెలుపు ఆశలు అడుగంటి పోయాయని, అందుకే పార్టీ పెద్దల హెచ్చరికలు, బెదరింపులను ఖాతరు చేసే పరిస్థితి ఉండదనీ అంటున్నారు. తాను ఎవరినీ వదులుకోననీ, అందరూ తనవారేనని గతంలో జగన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జగన్  సీల్డ్ కవర్ నివేదికల్లో ఉన్న విషయాన్ని బట్టి ప్రజ్వరిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.