బీజేపీని లెక్క చేసేదేమిటంటున్న జగన్?

Publish Date:Jun 13, 2023

Advertisement

ఒక్క రెండు సభలు.. బీజేపీ- వైసీపీ బంధాన్ని తెంచేశాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు, కుంభకోణాల మయమని తాజా పర్యటనలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చేసిన విమర్శలు.. ఆ పార్టీతో వైసీపీకి ఉన్న నాలుగేళ్ల బంధాన్ని పుటుక్కున తెంచాశాయి.

అయితే ఈ తెగదెంపులు వ్యూహాత్మకమా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కలిసి ఉంటే కలిసి మునిగిపోవడం కంటే.. వేరువేరుగా ఉంటే కనీసం ఒకరైనా మిగులుతామన్న ఉద్దేశంతోనూ అమిత్ షా నడ్డాలు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారని విశ్లేషిస్తున్నారు. నడ్డాపై వైసీపీ మంత్రులు బూతులతో విరుచుకుపడటం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ, ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బీజేపీ లేక్కేమిటన్నట్లు మాట్లడడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ నేతలూ, మంత్రులు, సలహాదారుల చేత మాట్లాడించి తాను మౌనం పాటించే జగన్  సోమవారం (జూన్ 12) పిల్లలకు స్కూలు బ్యాగులూ, పుస్తకాలు పంచేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో ఒక్క సారిగా బీజేపీపై తన వాగ్ధాటిని మరీ అంత పదునుగా కాకున్నా ప్రదర్శించారు.

రాష్ట్రంలో తమకు బీజేపీ అండ అవసరం లేదన్నారు. ఆ పార్టీ సహకారం లేకున్నా గెలుస్తామంటూ ధీమాను ప్రదర్శించారు. జగన్ నోటీ వెంట బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట రావడం దాదాపుగా ఇదే తొలిసారి. రాష్ట్రం ఏ గంగలో మునిగినా ఫరవాలేదు.. కేంద్రం అండతో కేసుల నుంచి గట్టెక్కితే చాలన్నట్లుగా అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లూ వ్యవహరించిన జగన్ చివరికి ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన ఈ సమయంలో బీజేపీ లేక్కేమిటి అన్నట్లు మాట్లాడటం మామూలు విషయం కాదంటున్నారు. 
అయితే బీజేపీ అంటే లెక్క చేయడం, చేయకపోవడం జగన్ ఇష్టం. కానీ ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన ఎంచుకున్న వేదికే అభ్యంతరకరం. పిల్లలకు పుస్తకాలు, బ్యాగులూ పంచే ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటమేమిటన్న విమర్శలు సహజంగానే వెల్లువెత్తుతున్నాయి. అయితే అటువంటి విమర్శలను సీఎం పెద్దగా పట్టించుకోరన్నది ఇప్పటికే పలు సార్లు రుజువైంది. ప్రభుత్వ కార్యక్రమంలో తప్ప  జగన్ మాట్లాడేందుకు మరో వేదికే లేని పరిస్థితి గత ఏడాదిన్నర కాలంగా ఏపీలో నెలకొని ఉంది.

జగన్ తన రాజకీయ విమర్శలకు ప్రభుత్వ కార్యక్రమాలనే వేదిక చేసుకుంటున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు అదే సరైన వేదికగా ఆయన ఫిక్సైపోయారు. పార్టీ పరంగా సభలూ, సమావేశాలూ నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఫిక్సైపోయారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బెదిరించో, బామాలో, ప్రలోభపెట్టో తీసుకు వచ్చిన జనాలే ఆయన ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లి పోతున్న పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే గడపగడపకూలో జరిగిన మర్యాదే తనకూ జరుగుతుందన్న విషయాన్ని ఆయన ఆకలింపు చేసుకోవడంతో తన వెర్షన్ చెప్పుకోవడానికి ఆయన బటన్ నొక్కుడు సభలనూ, ఇలా పందేరాల సభలనే వేదిక చేసుకుంటున్నారు. బీజేపీని తాను లెక్క చేయనని గంభీరంగా చెప్పిన జగన్ అదే సమయంలో తన ప్రభుత్వంపై బీజేపీ అగ్ర నేతలు చేసిన ఆరోపణలు, విమర్శల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారి విమర్శలను కనీసం ఖండించే ధైర్యం కూడా చేయలేదు.

షా, నడ్డాలు తన ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు.  చంద్రబాబుపై విమర్శలతో సరిపెట్టకుండా దూషణల పర్వానికీ దిగారు.  బీజేపీ అండగా లేకపోవచ్చు..మీడియా సహకారం అందక పోవచ్చు..దత్తపుత్రుడు అండ దండలు లేకపోవచ్చు…కానీ తన ధైర్యం ప్రజలేనని చెప్పుకున్నారు. మరి ఆ ప్రజల ముంగిటకు వెళ్లకుండా పరదాలెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అంతే కాదు చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట అని చెప్పుకొచ్చారు. తాను పేద ప్రజలకు డబ్బులు ఇస్తున్నానని… అది కూడదంటూ విపక్షాలు పోరాటం చేస్తున్నాయనీ ఆరోపించారు.  

జగన్ ఇటీవలి ప్రసంగాలు విపక్షాల సంగతేమో కానీ సొంత పార్టీ వైసీపీ శ్రేణులనే తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ఇంకా ఎన్నికల సమరం మొదలు కాకముందే ఓటమి భయాన్ని ప్రదర్శిస్తున్న నాయకుడిని జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ బీజేపీ అండ అవసరంలేదన్న మాటతో తన నెత్తిన తానే చేయిపెట్టుకున్నట్లైందని, మునక ఖాయమని అంగీకరించేసినట్లేనని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.