ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టే ఆలోచనలో జగన్ సర్కార్?

Publish Date:Sep 2, 2023

Advertisement

జగన్ సర్కార్ తీరు కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లుఅన్నట్లుగా ఉంది.  ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేసింది. రాష్ట్ర ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అందిన కాడికి అప్పులు చేసేసింది. వివిధ కార్పొరేషన్ల పేరిట, బాండ్లను ష్యురీటీగా పెట్టి రకరకాల మార్గాల ద్వారా ప్రపంచ బ్యాంకుల వద్ద కూడా అప్పలు చేసింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చింది. చివరికి దేవాలయాల భూములను కూడా తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించగా దానికి కోర్టులు బ్రేకులేశాయి.

ఒక రాష్ట్రం తన పరిధికి ఎంత అప్పు చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయో అంతా జగన్ సర్కార్ ఎప్పుడో చేసేసింది.అంతకు మించి కూడా చేసేసింది. అయినా ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలాడుకుంటున్నది. అందుకు కేంద్రం పెట్టే షరతులకు ఒప్పుకొని ప్రజా ప్రయోజనానికి కూడా గండికొట్టేసింది.ఇప్పటి వరకూ చేసిన అప్పులు సరిపోలేదేమో కానీ ఇప్పుడు ఏకంగా ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తాకట్టు పెట్టే ఆలోచన  చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఇప్పుడు మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. కార్డ్ ప్రైమ్ అని కొత్త సాఫ్ట్ వేర్ తో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఈ నూతన విధానంలో లాభనష్టాలపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వీటన్నిటినీ గమనిస్తే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తులపై కూడా హక్కు తనదే అని భావిస్తోందా? అవసరమైతే ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా కావాల్సిన విధంగా తాకట్టు పెట్టుకొని అప్పు తెచ్చుకోవాలని చూస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఎందుకంటే ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రజలకు ఇవ్వరట. కేవలం కలర్ జిరాక్స్ మాత్రమే హక్కు దారులకు అందిస్తారట. ఎప్పుడైనా ఆస్తి హక్కుదారులు తమ ఒరిజినల్ పత్రాలు తమకి కావాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే అప్పుడు కూడా స్పెసిమన్ కాపీలు ఇస్తారు. అవి కూడా ఒరిజినల్ కాదు. ఇప్పటివరకూ మనం ఆస్తి కొంటే అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్స్ మనకి ఇస్తారు. ఇవి మన దగ్గర ఉంటే ఆ ఆస్తి మనదే అనే నమ్మకం ఉంటుంది. ఎప్పుడైనా అవసరం అయితే ఆ పత్రాలను బ్యాంకులలో లేదా   వడ్డీ వ్యాపారుల వద్ద తనఖా పెట్టి డబ్బు తెచ్చుకొని అత్యవసరాలను తీర్చుకొనే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒరిజినల్ పత్రాలే హక్కు దారులకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

ఈ కొత్త కార్డ్ ప్రైమ్ అనే విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కలర్ జిరాక్స్ హక్కు దారుల చేతులో పెడతారు. కావాలని దరఖాస్తు చేసుకుంటే స్పెసిమన్ కాపీలు అందిస్తారు. కనీసం ఈ స్పెసిమన్ కాపీలు అయినా ఒరిజినలేనా అంటే ఇప్పటి వరకూ స్ఫష్టత ఇచ్చే నాధుడే కనిపించడం లేదు. ఈ స్పెసిమన్ కాపీలు బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తాయా అంటే ఏ రిజిస్టార్ ఆఫీసులో కూడా స్ఫష్టమైన సమాధానం రావడం లేదు. బయట వడ్డీ వ్యాపారుల వద్ద ఇక అసలు చెల్లె పరిస్థితే లేదు. మనం మన ఆస్తిని అమ్ముకోవాలంటే బహిరంగ మార్కెట్ లో ముందుగా చూసేది ఒరిజినల్ డాక్యుమెంట్.. దానికి లింక్ డాక్యుమెంట్. అవి రెండూ ఇప్పుడు కనిపించవని చెబుతున్నారు. దీంతో అసలు ఆస్తి మన పేరు మీదనే ఉందా.. ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ భద్రంగానే ఉన్నాయా అనే అనుమానం హక్కు దారునికి జీవితాంతం ఉంటుంది. 

దీంతో, ప్రభుత్వం వద్దే ప్రజల ఆస్తుల పత్రాలు ఉండడం అనేది ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈ పత్రాలు ఫిజికల్ గా కాకుండా డిజిటల్ విధానంలో స్టోర్ చేస్తారని అనుకుంటే అది ఇంకా ప్రమాదం. ఎప్పుడు ఎవరు టాంపర్ చేస్తే తమ ఆస్తి పత్రాలు కూడా పోతాయని ప్రజలు నిత్యం భయపడాల్సిన పరిస్థితి. మరి ఇంత రిస్క్ ఉన్నా ప్రభుత్వం ప్రజల ఆస్తుల పత్రాలను తమ ఉంచుకోవాలనుకోవడం చూస్తుంటే.. ప్రభుత్వం వీటిని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసే  ఆలోచన ఏమైనా చేస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.